బెంగాలీ తెర ప్రథమ మహిళగా చెప్పుకునే కానన్ దేవి గురించి చాలామందికి తెలియదు.ఈమె గురించి ఈ తరానికి అసలు పరిచయమే లేదు అని చెప్పవచ్చు.
ఇంతకీ ఆమె ఎవరు? ఆమె స్వస్థలం ఏది? మరిన్ని పూర్తి వివరాల్లోకి వెళితే.పశ్చిమ బెంగాల్( West Bengal )లోని హౌరాలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది కానన్ దేవి( kanan devi ).1916 ఏప్రిల్ 22న జన్మించింది.రతన్ చంద్రదాస్, రాజోబాలదాస్ ఈమె తల్లిదండ్రులు.
తండ్రి దగ్గరుండి కానన్‌కు సంగీతంలో శిక్షణ ఇచ్చేవాడు.కొంతకాలానికే అతడు కన్నుమూయడంతో ఇంటికి పెద్ద దిక్కు లేకుండా పోయింది.
ఆర్థిక కష్టాలు కుటుంబాన్ని వెంటాడాయి.ఇంటి అద్దె కూడా కట్టకపోవడంతో ఇంటి యజమాన్ని కానన్ కుటుంబాన్ని ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు.

దిక్కుతోచని స్థితిలో ధనవంతుల ఇంట్లో పనిమనుషులుగా చేరారు తల్లీకూతుళ్లు.తలదాచుకోవడానికి నిలువ నీడ లేని వీరికి ఒక బంధువు ఇల్లు ఇచ్చి అందులో ఉండమని చెప్పాడట.దేవుడిలా వచ్చి సాయం చేశాడనుకునే లోపే అతడు తన నిజస్వరూపం చూపించాడు.పట్టుమని ఏడేళ్లు కూడా లేని కానన్‌తో ఆమె తల్లితో బండచాకిరీ చేయించుకున్నాడు.వారితో అసభ్యంగా ప్రవర్తించాడు.ఇది సహించలేకపోయిన కానన్ ఆ ఇంటి నుంచి తల్లితో పాటు బయటకు వచ్చేసింది.
ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితిలో కోల్‌కతాను వదిలి తిరిగి హౌరా వెళ్లిపోయారు.వేశ్యాగృహాలకు సమీపంలో ఒక గది అద్దె తీసుకుని జీవించారు.
వీరి కుటుంబ స్నేహితుడైన తులసి బెనర్జీ కానన్‌ను చూసి తను సినిమాల్లో రాణించగలదని గ్రహించాడు.అప్పుడు కానన్ వయసు 10 ఏళ్లు.

మదన్ మూవీ స్టూడియో. జైదేవ్ అనే సినిమా( Jaydev )లో ఆఫర్ ఇచ్చింది.ఇందుకు గానూ కానన్ అందుకున్న నెల జీతం రూ.5.1928-31 మధ్య బాలనటిగా పలు చిత్రాలు చేసింది.అదే సమయంలో గాయనిగా కూడా సత్తాను చాటుకుంది.ఎన్నో సినిమాలలో బాలనాటిగా కనిపించడంతో పాటు సింగర్ గా కూడా మెప్పించింది.21 ఏళ్లకే హీరోయిన్‌గా మారింది కానన్.అప్పట్లో ఈమె అందానికి బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండేది.అందం నటనతో అతి తక్కువకాలంలోనే వెండితెర సూపర్‌స్టార్‌గా అవతరించింది.పాట పాడినందుకు రూ.1 లక్ష, సినిమాలో హీరోయిన్‌గా నటించినందుకు రూ.5 లక్షలు తీసుకునేది.మొత్తంగా కానన్ 40 పాటలు పాడగా దాదాపు 57 సినిమాలు చేసింది.
హీరోలకు సలాం కొడుతున్న రోజుల్లో అందరిచేతా మేడమ్ అని పిలిపించుకున్న మొదటి హీరోయిన్ ఈవడే అని చెప్పవచ్చు.