ఆ స్పెషల్ రికార్డు సృష్టించిన ఏకైక ఇండియన్ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా...

టీమిండియా వరుస పరాజయాల తర్వాత సెమీస్ కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయినప్పటికీ.మిగతా మ్యాచుల్లో మాత్రం తన సత్తా చాటుకుంటోంది.

 Indian Fast Bowler Jasprit Bumrah The Only Player To Do That Special Record, T20-TeluguStop.com

పసికూనల మీద భారత ఆటగాళ్లు చూపిస్తున్న అమోఘమైన ఆటతీరు యావత్ భారత క్రికెట్ ప్రియులను ఫిదా చేస్తోంది.టీమిండియా బ్యాట్స్‌మెన్‌లు సిక్సులు, ఫోర్లతో చెలరేగిపోతుంటే.

తమేమన్నా తక్కువా అన్నట్లు బౌలర్లు కూడా వరుసగా వికెట్లు పడగొడుతూ సంచలనాలు సృష్టిస్తున్నారు.ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా శుక్రవారం నాడు స్కాట్లాండ్ తో ఆడిన మ్యాచ్ లో అద్భుతమైన ప్రతిభతో ఆకట్టుకున్నాడు.

అతడు రెండు కీలకమైన బ్యాట్స్‌మెన్‌లను ఔట్ చేయడంతో స్కాట్లాండ్ జట్టు 85 పరుగులకే కుప్పకూలింది.

నిన్న జరిగిన మ్యాచ్‌లో భారత్ తరఫున షమీ, జడేజా ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ల చొప్పున ఔట్ చేయగా.

జస్ప్రీత్ బుమ్రా కేవలం 10 పరుగులిచ్చి ఇద్దరు స్కాట్లాండ్ ఆటగాళ్లను పెవిలియన్ కు పంపించాడు.ఈ మ్యాచ్ సందర్భంగా బుమ్రా 3.4 ఓవర్లు వేయగా.ఒక్కో ఓవర్‌లో సగటున కేవలం 2.7 పరుగులు మాత్రమే వచ్చాయి.జస్ప్రీత్ బుమ్రా స్కాట్లాండ్‌పై ఒక మెయిడిన్ ఓవర్ కూడా వేసి ఆశ్చర్య పరిచాడు.

దాంతో టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్ గా తన పేరును ప్రథమ స్థానంలో లిఖించుకున్నాడు.

Telugu Bhumra, Chahal, India, Indianfast, Latest, Mohammad Shami, Ups, Cup-Lates

టీ20 మ్యాచ్‌ల్లో మెయిడిన్ ఓవర్లు సాధించడం అంత సులువైన పని కాదు.కానీ ఇప్పటివరకు బుమ్రాకు 8 మెయిడిన్ ఓవర్లు వేసి స్పెషల్ రికార్డు నెలకొల్పిన ఏకైక భారత బౌలర్ గా గెలిచాడు.అతడి తర్వాతి స్థానాల్లో నువాన్ కులశేఖర, ముస్తిఫిజుర్ రెహమాన్ చెరో 6 మెయిడిన్లతో చోటు దక్కించుకున్నారు.

అయితే జస్ప్రీత్ బుమ్రా టీ20 ఇంటర్నేషనల్స్‌లో మరొక అరుదైన రికార్డు నెలకొల్పాడు.

Telugu Bhumra, Chahal, India, Indianfast, Latest, Mohammad Shami, Ups, Cup-Lates

శుక్రవారం నాటి 2 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జస్ప్రీత్ సంచలనం సృష్టించాడు.అంతకుముందు 63 వికెట్లు తీసి యుజ్వేంద్ర చాహల్‌ ప్రథమ స్థానంలో ఉండేవాడు.కానీ ఇప్పుడు జస్ప్రీత్ అతడి కంటే ఒక వికెట్ ఎక్కువగా తీసి ఫస్ట్ ప్లేస్ లో స్థానం దక్కించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో బుమ్రా ఒక్కరే కాదు షమీ కూడా మెయిడిన్ ఓవర్ వేసాడు.గమ్మత్తేమిటంటే వీరిద్దరూ ఒకే ఓవర్‌లో వికెట్లు తీసి ఆశ్చర్యపరిచారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube