గల్ఫ్ లో భారతీయుడి ని వరించిన కళ్ళు చెదిరే.. లాటరీ       2018-07-04   02:30:13  IST  Bhanu C

ఈ మధ్య గల్ఫ్ కంట్రీస్ లో లాటరీల రూపంలో భారతీయులని అదృష్టం వరిస్తోంది..గల్ఫ్ కంట్రీస్ లో అధికారికంగా నిర్వచిందే లాటరీలలో ఎక్కువగా భారతీయులు గెలుపొండుతున్నారు..గడిచిన నాలుగు నెలల కాలంలో సుమారు 5 మంది వ్యక్తులని ఈ లాటరీ వరించింది..అయితే తాజాగా మరొక భారతీయుడికి కళ్ళు చెదిరే లాటరీ వచ్చి పడింది వివరాలలోకి వెళ్తే..

యూఏఈలోని అబుదాబి లో నివాసముంటున్న ఓ భారత ఎన్నారై ని భారీ అదృష్టం వరించింది. ఒక్కసారిగా ఆ వ్యక్తి సంపన్నవంతుడిగా మారిపోయాడు. 7 మిలియన్ దిర్హమ్‌ల విలువైన లాటరీ అతడి సొంతమైంది. భారత్‌కు చెందిన తొజో మాథ్యూ అనే వ్యక్తి “బిగ్ టికెట్ అబుదాబి లక్కీ లాటరీ” లో గెలుపొందాడు..ఆయన కొనుగోలు చేసిన టికెట్ నెంబర్ “075171” కు లాటరీ దక్కింది. దీంతో 7 మిలియన్ దిర్హమ్‌ల భారీ డబ్బు ఆయనకు దక్కింది.

అయితే ఈ మొత్తం భారత కరెన్సీ తో పోలిస్తే అక్షరాలా రూ. 13 కోట్లు పైమాటే. ఈ వార్తను ‘బిగ్ టికెట్ అబుదాబి లక్కీ లాటరీ’ నిర్వాహకులు అబుదాబి ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ప్రకటించారు. మాథ్యూతో మరో 9 మంది తక్కువ విలువగల లాటరీలను గెలుచుకున్నారు. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ఈ లాటరీ గెలుచుకున్న 9 మందిలో మరో ఐదుగురు భారతీయులు ఉండడం విశేషం.