అదృష్టం అంటే ఆ భారతీయ ఎన్నారైదే లక్కు మాములుగా లేదుగా  

Indian Expat Wins Dh10 Million In Big Ticket Abu Dhabi-dh10 Million Win,indian Expat,ravindra Boloor,బిగ్ టికెట్ అబుదాబి రాఫల్ డ్రా,రవీంద్ర బలూర్

భారతీయులు ఎక్కడ ఉన్నా సరే ఓ వెలుగు వెలుగుతూ ఉంటారు. తమదైన ముద్ర ఎక్కడ ఉన్నా పడాల్సిందే. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే భారతీయుడి గుర్తింపు ఓ రేంజ్ లోనే ఉంటుంది...

అదృష్టం అంటే ఆ భారతీయ ఎన్నారైదే లక్కు మాములుగా లేదుగా-Indian Expat Wins Dh10 Million In Big Ticket Abu Dhabi

అదృష్టం కూడా భారతీయులకి జేబూలేనే ఉంటుంది. ఎందుకంటారా. అరబ్ కంట్రీస్ లో భారీగా లాటరీలు జరుగుతుంటాయి.

వాటిలో అధ్యధికంగా భారతీయులకే లక్కు దక్కుతూ ఉంటుంది.

తాజాగా అక్కడ ప్రతీ ఏటా తీసే బిగ్ టికెట్ అబుదాబి రాఫల్ డ్రా లో మరోసారి భారతీయుడే విజయం సాధించాడు. ఇందులో స్పెషల్ ఏమిటి అనుకుంటున్నారా ఈ లాటరీ వరుసగా నాలుగు సార్లు భారతీయులకి వచ్చిందట.

అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఈ లాటరీ ఫలితాలను వెల్లడించారు.

రవీంద్ర బలూర్ అనే ఓ ప్రవాసభారతీయుడికి ఈ లాటరీ లక్కు చిక్కింది దాంతో అతడు ఒక్క సారిగా కోటీశ్వరుడు అయ్యాడు. దాదాపు 18.5 కోట్లు బహుమతిగా అందుకున్నాడు. అతడికి కి ఈ విషయం తెలిపామని త్వరలో అతడికి ఈ డబ్బు మొత్తం అప్పగిస్తామని నిర్వాహకులు తెలిపారు.