ఇద్దరి సాయం.. కోటిన్నర జరిమానా మాఫీ: 20 ఏళ్ల తర్వాత మాతృభూమికి భారతీయుడు  

Indian Expat In UAE To Fly Home After 20 Years, $204,195 Fine Waived, UAE, Thanavel Mathiazhaagan, Passport,Indian Embassy, Indian - Telugu $204, 195 Fine Waived, Indian, Indian Embassy, Indian Expat In Uae To Fly Home After 20 Years, Passport, Thanavel Mathiazhaagan, Uae

ఉపాధి కోసం దేశం కానీ దేశానికి వలసవెళ్లి, నానా కష్టాలుపడి 20 ఏళ్ల తర్వాత మాతృభూమిలో అడుగుపెట్టాడో భారతీయుడు.సినిమా కథను తలపించే ఈ దీనగాథ విన్న వారికి కళ్లు చెమర్చకమానదు.

TeluguStop.com - Indian Expat Uae Fly Home After 20 Years

తమిళనాడు రాష్ట్రానికి చెందిన థనవేల్ మథియాలాగన్ అనే వ్యక్తి 36 ఏళ్ల వయసులో 2000వ సంవత్సరంలో ఉపాధి కోసం ఓ ఏజెంట్‌ను నమ్మి దుబాయ్‌ వెళ్లాడు.

అయితే అతను థనవేల్ దగ్గర డబ్బు తీసుకుని అతని పాస్‌‌పోర్ట్ లాక్కొని పారిపోయాడు.

TeluguStop.com - ఇద్దరి సాయం.. కోటిన్నర జరిమానా మాఫీ: 20 ఏళ్ల తర్వాత మాతృభూమికి భారతీయుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ఏం చేయాలో తెలియక ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుందన్న మొండి ధైర్యంతో కుటుంబం కోసం దుబాయ్‌లోనే ఉండిపోయాడు.పాస్‌పోర్ట్, వీసా లేకుండా అక్కడే అక్రమంగా జీవిస్తూ వచ్చాడు.

అయితే కరోనా వైరస్ విజృంభించడంతో దుబాయ్‌ నుంచి వచ్చేయాలని థనవేల్ ప్రయత్నించాడు.

తన పరిస్ధితిని భారతదేశానికి చెందిన ఏకే మహదేవన్, చంద్రప్రకాశ్ అనే ఇద్దరు సామాజిక కార్యకర్తల దృష్టికి తీసుకొచ్చాడు.

అతని ఆవేదనను అర్థం చేసుకున్న వారిద్దరూ యూఏఈలోని భారత రాయబార కార్యాలయం ద్వారా సాయం చేయాలని నిర్ణయించుకున్నారు.దీనిలో భాగంగా ఎమర్జెన్సీ సర్టిఫికెట్ కోసం ప్రయత్నించారు.

అయితే దుబాయ్ ‌వచ్చినప్పుడు పాస్‌పోర్ట్‌ను ఏజెంట్ ఎత్తుకుపోవడంతో అది సాధ్యం కాలేదు.
పాస్‌పోర్ట్ పొగొట్టుకున్నా, లేకపోయినా ఎంబసీ అధికారులు ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు.

దాని సాయంతో భారతీయులు స్వదేశానికి రావొచ్చు.అయితే థనవేల్ సమర్పించిన కొన్ని పత్రాల్లో అతని తండ్రి పేరు తప్పుగా ఉన్నట్లు ఎంబసీ అధికారులు గుర్తించారు.

ఏకే మహాదేవన్, చంద్రప్రకాశ్ ప్రస్తుతం ఈ తప్పును సరిచేసే పనిలో ఉన్నారు.

మరోవైపు థనవేల్ రెండు దశాబ్ధాల నుంచి దుబాయ్‌లో అక్రమంగా వున్నందుకు యూఏఈ ప్రభుత్వం 7.5 లక్షల దిర్హామ్‌లు ( భారత కరెన్సీలో రూ.కోటి 50 లక్షలు) జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.అయితే దీనిపై భారత రాయబార కార్యాలయం చొరవ తీసుకోవడంతో థనేవ్‌ల్ ఎటువంటి జరిమానా లేకుండా అతి త్వరలో భారతదేశానికి చేరుకోగలుగుతున్నాడు.

#195 Fine Waived #Indian #IndianExpat #Passport #Indian Embassy

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Expat Uae Fly Home After 20 Years Related Telugu News,Photos/Pics,Images..