డబ్బును ఎలా మేనేజ్ చేయాలంటే: కార్మికుల కోసం భారత సంతతి విద్యార్ధుల యాప్‌

కాయకష్టం చేసుకుని బతికే శ్రామజీవులకు రెక్కాడితే కానీ డొక్కాడదు.ఇలాంటి వారు భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు చేయడమన్నది ఆచరణలో అంత సులువు కాదు.

 Indian Expat Students In Dubai Launch App, Comic Series For Workers, Dubai, Indi-TeluguStop.com

చదువుకున్న వారితో పోలీస్తే వీరిలో ఆర్ధిక నిర్వహణ అంతంత మాత్రమే.ఇలాంటి వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్న ఇద్దరు అన్నదమ్ములు టెక్నాలజీ సాయంతో ఓ సేవింగ్స్ యాప్, కామిక్ సిరీస్‌ను కనిపెట్టారు.
వివరాల్లోకి వెళితే.యూఏఈలో స్థిరపడిన భారత సంతతికి చెందిన 17 ఏళ్ల వరుణ్ మిట్టల్, తన తమ్ముడు అమన్‌తో కలిసి కార్మికులకు సాయం చేయాలనే ఉద్దేశ్యంతో ఆర్ధిక పరిస్ధితికి, మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా పనిచేసే ‘‘ కాష్ కాష్ ’’ అనే యాప్‌ను రూపొందించాడు.

దీని సాయంతో వ్యక్తులు తమ డబ్బు, ఖర్చులను బేరీజు వేసుకవోడంతో పాటు తాము ఎంత పొదుపు చేయవచ్చో తెలుసుకోవచ్చు.అలాగే ‘‘ ఇకోనోమిక్స్’’ అనే కామిక్స్‌ను సైతం రూపొందించారు.
దీనిలోని బొమ్మల సాయంతో ఆర్ధిక వ్యవహారాలను సులభంగా అర్ధం చేసుకోవచ్చు.హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తయారు చేసిన ఈ కామిక్స్ పుస్తకాలను యూఏఈ వ్యాప్తంగా వున్న కార్మిక శిబిరాలలో ఉండే శ్రామికులకు అందజేస్తున్నారు.

వరుణ్ జుమేరియా కళాశాలలో 13వ తరగతి చదువుతుండగా.అమన్ 11వ తరగతి చదువుతున్నాడు.

ఎకనిమక్స్ అంటే తనకు ఎంతో ఇష్టమని, సమాజంలోని అందరికీ మంచి జీవితాన్ని అందించాలన్నది తన ధ్యేయమని వరుణ్ చెప్పాడు.యువత, శ్రామికులకు ఉపయోగపడేలా, వారు పొదుపు చేయడం ఎలాగో తెలుసుకునేలా చేయాలన్న తన ఆలోచనకు కార్యరూపమే ‘‘ కాష్ కాష్ ’’ యాప్ అని అతను తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube