గిన్నిస్ రికార్డుల రారాజు ఈ ఎన్ఆర్ఐ: తాజాగా 19వ సారి పుస్తకంలోకి..!!

ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్ బుక్‌లోకి ఎక్కాలని ఎంతో మంది కల.ఇందుకోసం అమెరికా నుంచి అమలాపురం దాకా చాలా మంది రకరకాల విన్యాసాలు చేస్తుంటారు.

 Indian Expat In Uae Bags 19th Guinness Record With Giant Greeting Card, Guinness-TeluguStop.com

కానీ ఓ భారతీయుడు మాత్రం, ఒకటి కాదు.రెండు కాదు ఏకంగా 19 సార్లు గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించాడు.వివరాల్లోకి వెళితే… దుబాయ్‌లో నివసిస్తున్న భారతీయుడు రామ్‌కుమార్ సారంగపాణి 8.2 చదరపు మీటర్ల అతిపెద్ద పాప్ అప్ గ్రీటింగ్ కార్డును తయారు చేసి గిన్నిస్ ప్రపంచ రికార్డును సాధించారు.

యూఏఈ ఉపాధ్యక్షుడు ప్రధానమంత్రి షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మఖ్తుమ్ పదవీ బాధ్యతలు స్వీకరించి 15 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సారంగపాణి గ్రీటింగ్ కార్డును తయారు చేశారు.4 మీటర్ల పొడవు, 2.05 మీటర్ల వెడల్పు ఉంటుంది.దీని తయారీకి ఆయనకు ఆరు నెలల సమయం పట్టిందట.

రామ్‌కుమార్ తన జీవితకాలంలో సెంచరీల రికార్డును సాధించాలన్న లక్ష్యంతో వున్నారు.ఆయన సాధించిన రికార్డుల విషయానికి వస్తే ఎక్కువ భాగం యూఏఈకి సంబంధించినవే వున్నాయి.

నవంబర్ 18న గిన్నిస్ రికార్డ్స్ దినోత్సవం సందర్భంగా మారథాన్ రికార్డ్ బ్రేకింగ్‌కు యత్నించిన సారంగపాణి కేవలం 7 గంటల 50 నిమిషాల వ్యవధిలో ఆరు ప్రపంచ రికార్డులను బద్ధలు కొట్టారు.

Telugu Times Guinness, Sq Pop, Dubai, Guinness, Marathon, Sheikhmohammed-Telugu

రామ్‌కుమార్ గిన్నిస్ రికార్డులు:


అతిపెద్ద డెస్క్ క్యాలెండర్ (యూఏఈ క్యాలెండర్), ఫొటో ఫ్లిప్ పుస్తకంలోని ఎక్కువ పేజీలు, అతిపెద్ద బ్యాంకు నోట్స్ మొజాయిక్ (ఐ లవ్ యూఏఈ), పొడవైన లైన్ ప్లాస్టిక్ కార్డులు (యూఏఈ ఫ్లాగ్ ), అతిపెద్ద మాగ్నెట్ వాక్యం (50,102 అయస్కాంతాలు), అతిపెద్ద మాగ్నెట్ వర్డ్ – (50,020 అయస్కాంతాలు), అతిపెద్ద ఎలక్ట్రానిక్ గ్రీటింగ్ కార్డ్ – 12 చదరపు మీటర్లు , అతిపెద్ద బ్యాంకు నోట్ వర్డ్ – 3,040 నోట్లు , అతిపెద్ద నోటు వాక్యం – (5,005 నోట్లు), ప్లేయింగ్ కార్డుల చిన్న ప్యాక్ – (7 మిమీ) ఎక్స్ 5 ఎమ్ఎమ్ఎక్స్ (4.86 మిమీ)… వంటివి ఉన్నాయి.తాను గత 17 సంవత్సరాలుగా దుబాయ్‌లో నివసిస్తున్నట్లు తెలిపిన సారంగపాణి.

ఈ నగరం తనకు చెన్నై‌లాగా ఇష్టమైనదన్నారు.దుబాయ్‌‌తో ముడిపడిన ఎన్నో రికార్డులు సాధించడం గర్వకారణంగా ఉందని రాంకుమార్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube