రెండు నెలలుగా “కోమా” లోనే ఉన్న “భారత ఎన్నారై”..       2018-05-11   23:01:16  IST  Bhanu C

డబ్బు సంపాదించాలి..తమ కుటుంబాలని ఎంతో జాగ్రత్తగా ఎటువంటి లోటూ రాకుండా చూసుకోవాలి..అనే భావనతో తమ వాళ్ళ కోసం అందరినీ విడిచి పరాయి దేశంలో పనికి వెళ్లి అక్కడ మానసికంగా శారీరకంగా ఎన్నో ఇబ్బందులని ఎదుర్కుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు…తమ కుటుంబాలు ఉన్నత స్థితిలో ఉండాలి తమ కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి అంటూ ఎన్నో ఏళ్లుగా విదేశాలలో ఉంటూనే తమ కుటుంబాలని చూడకుండా కొన్నేళ్ళు పాటు అక్కడే ఉండి పోయి అనారోగ్యం పాలయ్యే వాళ్ళు కూడా ఉంటారు..అయితే అలాంటి సంఘటనే ఇప్పుడు అబుదాబీలో జరిగింది.

ఎన్నో ఆశలతో భారత్ నుంచి యూఏఈకి వలస వెళ్లిన ఓ భారతీయ కార్మికుడి పరిస్థితి ఎంతో దయనీయంగా మారిపోయింది కేరళకు చెందిన ముస్తఫా కందత్‌వల్లపిల్ కొద్దిరోజుల క్రితం అబుదాబిలోని ఖలీదియాహ్ మాల్ హైపర్ మార్కెట్ వద్ద పని చేస్తుండగా మెదడులో రక్తస్రావం జరిగింది…దాంతో ఒక్కసారిగా అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు దాంతో హుటాహుటిన దగ్గరలోని క్లీవీలాండ్ క్లినిక్ అబుదాబి హాస్పిటల్‌కు తరలించారు..అయితే అతడిని పరీక్షించిన వైద్యులు అతడు కోమాలోకి వెళ్ళే అవకాశం ఉందని తేల్చారు..

అయితే..ఈ పరిణామాలతో అతను దాదాపు అదే హాస్పటల్ లో 53 రోజులుగా కోమాలోనే ఉండడంతో ఆయన కుటుంబం ముస్తఫాను భారత్ తీసుకెళతామని అక్కడి వైద్యులని కోరింది..దానికి ఒప్పుకున్న వైద్యులు ముస్తఫా ని తీసుకు వెళ్ళమని తెలిపారు..దాంతో ప్రత్యేక విమానం ద్వారా గురువారం ఆయనను కేరళలోని తమ స్వస్థలానికి తీసుకెళ్లనున్నామని ముస్తఫా కుమారుడు చెప్పాడు..ముస్తఫా ఆరోగ్య పరిస్థితి ఇప్పుడేమి చెప్పలేమని అయితే కోలుకునే అవకాశం మాత్రం ఉంటుందని తెలిపారు అబుదాబీ వైద్యులు..