దుబాయ్‌లో బిల్డింగ్‌పై నుంచి పడి భారతీయుడి మృతి: ప్రమాదమా.. ఆత్మహత్యా..?  

Indian Engineer Falls To Death Near Worksite In Dubai - Telugu Dubai, Engineer, Indian, Nri, Telugu Nri News, Worksite

దుబాయ్‌లో విషాదం చోటు చేసుకుంది.అపార్ట్‌మెంట్‌పై నుంచి కింద పడి 25 ఏళ్ల భారతీయ ఇంజనీర్ దుర్మరణం పాలయ్యాడు.

Indian Engineer Falls To Death Near Worksite In Dubai - Telugu Nri News

కేరళకు చెందిన సబీల్ రెహ్మాన్ 2018 నుంచి దుబాయ్‌లోని ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేస్తూ, రాస్ అల్ ఖోర్‌లో తన్న అన్నయ్య ఇంట్లో నివసిస్తున్నాడు.ఈ క్రమంలో మంగళవారం తాను పనిచేసే ప్రదేశానికి దగ్గరలోని ఓ భవనం నుంచి కిందపడి మరణించాడని ఖలీజ్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.

మలప్పురం జిల్లాలోని తిరూర్‌లోని అతని ఇంటికి సబీల్ మృతదేహాన్ని తరలించడానికి సామాజిక కార్యకర్త నసీర్ వతనాపల్లి సహకారం అందిస్తున్నారు.ఈ ఘటనపై నసీర్ మాట్లాడుతూ.సబీల్ తన వర్క్‌సైట్‌కు దగ్గరలోని అపార్ట్‌మెంట్‌కు ఎందుకు వెళ్లాడో తమకు తెలియదని… అందువల్ల ఈ కేసు అసాధారణమైనదిగా ఆయన అభివర్ణించారు.దుబాయ్‌లో నివసించే కాలంలో సబీల్ ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నాడా అన్నది అతని కుటుంబానికి తెలియదని నసీర్ చెప్పారు.

అతను చివరిసారిగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన కొత్త మొబైల్ ఫోన్‌ను రిసీవ్ చేసుకోవాల్సిందిగా తన సోదరుడితో మాట్లాడాడని నసీర్ వెల్లడించారు.

అతని కుటుంబంలోని నలుగురు తోబుట్టువులలో రెహ్మాన్ చిన్నవాడు.అతని మరణవార్తతో షాక్‌కు గురైన కుటుంబం రషీడియా పోలీస్ స్టేషన్ మరణానికి దారి తీసిన కారణాలను తెలుసుకునేందుకు ఎదురుచూస్తోంది.చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేసి సబీల్ మృతదేహాన్ని భారతదేశానికి పంపిస్తామని నసీర్ స్పష్టం చేశారు.

తాజా వార్తలు

Indian Engineer Falls To Death Near Worksite In Dubai-engineer,indian,nri,telugu Nri News,worksite Related....