కువైట్ లో భారత ఎన్నారైల కోసం ఎంబసీ “ఓపెన్ హౌస్” ఎప్పుడంటే...

కువైట్ లోని భారత ఎంబసీ అక్కడి భారత ప్రవాసుల కోసం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనుంది.24 -11-2021 న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఎంబసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.కువైట్ లో భారతీయులు ఎదుర్కుంటున్న సమస్యలు, వ్యాక్సినేషన్, పాస్ పోర్ట్ లో లోపాలు, వ్యాక్సిన్ సర్టిఫికెట్ స్టేటస్ ఇలా పలు కీలక అంశాలపై ఈ ఓపెన్ డిబేట్ జరగనుందని తెలుస్తోంది.అయితే ఈ ఓపెన్ హౌస్ లో పాల్గొనాలని భావించే వారు తప్పకుండా రిజిస్ట్రేషన్ ముందుగానే చేసుకోవాలని సూచించింది ఎంబసీ.

 Indian Embassy To Hold Open House In Kuwait, Indian Embassy, Kuwait, Open House,-TeluguStop.com

పూర్తి వివరాలలోకి వెళ్తే.

భారత్ నుంచీ కువైట్ దేశానికి ప్రవాసులు అత్యధికంగా వెళ్తూ ఉంటారు.

అలా వెళ్ళిన వారిలో అధిక శాతం మంది కార్మికులుగా వెళ్తూ ఉంటారు.అయితే కరోన సమయంలో కువైట్ తమ దేశంలోకి ప్రవాసులు వచ్చేందుకు పలు నిభంధనలతో కూడిన ఆంక్షలు విధించింది.

ఇదిలాఉంటే కువైట్ లో ఉన్న ప్రవాసుల కోసం వారి సమస్యలు సందేహాల నివృత్తి కోసం కువైట్ ఎంబసీ ఓపెన్ డిబేట్ ఏర్పాటు చేసింది.ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రవాసులు, భారత్ నుంచీ వెళ్ళే ప్రవాసులకు ఎన్నో సందేహాలు ఉండటమే అందుకు ప్రధాన కారణంగా ఎంబసీ ప్రకటించింది.

భారత పాస్ పోర్ట్ , వీసా అప్డేట్ వ్యాక్సినేషన్ ఇలా ప్రతీ అంశంపై ఎన్నో సందేహాలను ఎంబసీ ఓపెన్ డిబేట్ లో చర్చించనుంది.అంతేకాదు అక్కడ ప్రవాసులు ఎదుర్కుంటున్న సమస్యలపై కూడా చర్చించవచ్చునని తెలిపింది.

కాగా ఈ కార్యక్రమానికి ప్రవాసులు భారత అందరూ పాల్గోనవచ్చునని అయితే వ్యాక్సినేషన్ వేసుకున్న వారికి మాత్రమే ప్రవేశం ఉందని తెలిపింది.ఈ కార్యక్రమంలో పాల్గోనాలనుకునే వారు community.

kuwait@mea.gov.in కు ఈమెయిల్ చేయడం ద్వారా కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఎంబసీ వెల్లడించింది.

వర్చువల్ విధానం ద్వారా కూడా ఈ చర్చల్లో పాల్గొనవచ్చునని ఎంబసీ ప్రకటించింది. https://zoom.us/j/99832801639?pwd=MlRKeDJxaWxmMGkybmxZR0JZc2Nqdz09#success

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube