అరెస్ట్ అయిన విద్యార్ధుల కోసం...'హెల్ప్ లైన్'  

అమెరికా నకిలీ వీసాల రాకెట్ ఎంతటి కలకలం రేపిందో వేరే చెప్పనవసరం లేదు. విద్యార్ధి వీసాల ముసుగులో విదేశీయులని అక్రమంగా అమెరికాలోకి పంపి అక్కడ నివసింఛి, ఉద్యోగం చేసుకునేలా మధ్యవర్దిత్వం చేసిన 8 దళారులని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. నకిలీ వీసాలతో ఉంటున్న దాదాపు 130 మంది విదేశీయులని కూడా అదుపులోకి తీసుకున్నారు.

అయితే వీరిలో సుమారు 129 మంది భారతీయులు ఉన్నారని అధికారు వెల్లడించారు. అయితే అమెరికాలో భారత ఎంబసీ అరెస్ట్ అయిన విద్యార్ధులకు సాయం చేసేందుకు 24 గంటల పాటు పనిచేసే హాట్‌లైన్‌ను తెరిచింది. విద్యార్థులు, వాటి కుటుంసభ్యులకు నిత్యం అందుబాటులో ఉండేందుకు గాను ఓ అధికారిని కూడా నియమించింది.

Indian Embassy Opens Helpline For US Arrested Students-Us Students Us Visa Scam

Indian Embassy Opens Helpline For US Arrested Indian Students

202-322-1190, 202-340-2590 రెండు హెల్ప్ లైన్ నంబర్లని అరెస్ట్ అయిన విద్యార్ధుల కోసం ఏర్పాటు చేసినట్లుగా అధికారులు తెలిపారు. అంతేకాకుండా అరెస్ట్ అయిన వారికోసం cons3.washington@mea.gov.com అనే ఈమెయిల్ ద్వారా ఎంబసీ అధికారులను సంప్రదించవచ్చని సూచించారు.