అంత దారుణమైన పరిస్థితి ని భారత్ ఎదుర్కోవాల్సిందేనా ?  

Lockdown, India, Economy, Corona Effect, Lockdown - Telugu Corona Effect, Economy, India, Lockdown

భారతదేశం ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాల్లో అగ్రగామి దేశంగా మారుతూ వస్తోంది.భారతదేశాన్ని అదే స్థాయిలో ప్రపంచదేశాలన్నీ గుర్తుస్తున్నాయి.

TeluguStop.com - Indian Economy Situation Employees Corona Effect

ఇదిలా ఉండగానే ఆకస్మాత్తుగా కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశం తీవ్ర అతలాకుతలం అవుతోంది.ప్రపంచ దేశాలన్నింటికీ ఈ కరోనా వైరస్ ప్రభావంతో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం కనిపిస్తోంది.

ముఖ్యంగా భారత దేశ ఆర్థిక వ్యవస్థ పై కరోనా వైరస్ కొట్టే దెబ్బ అంతా ఇంతా కాదు.ఎందుకంటే భారతదేశ జనాభాలో మెజారిటీ ప్రజలంతా పేద మధ్య తరగతి వర్గాలకు చెందిన వారే.

TeluguStop.com - అంత దారుణమైన పరిస్థితి ని భారత్ ఎదుర్కోవాల్సిందేనా -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

వైరస్ కారణంగా దాదాపు 40 కోట్ల మంది మరింత పేదరికంలోకి వెళ్లిపోతారని ప్రపంచ కార్మిక సంస్థ తేల్చి చెప్పింది.భారత వృద్ధిరేటు ఊహించనంతగా దిగజారి పోతోందని లెక్కలు బయటకు వస్తున్నాయి.

ఎందుకంటే భారత్ లో ఎక్కువ శాతం మంది ప్రజలు చిరు వ్యాపారులు, చిన్న చిన్న సంస్థల్లో పనిచేసే ఉద్యోగులే.రోజు కూలీలు ఎక్కువ శాతం మంది ఉన్నారు.

సాఫ్ట్ వేర్ వంటి ఇతర సేవా రంగాల్లో పనిచేసే వారు ఉన్నారు.ఇప్పుడు ఈ ఆర్థిక సంక్షోభం కారణంగా వారు వీరు అనే తేడా లేకుండా అందరిపైనా ఈ ప్రభావం కనిపించబోతోంది.

ఇప్పటికే లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఎగిరిపోతున్నాయి.మరి కొంతకలం పాటు ప్రపంచవ్యాప్తంగా వైరస్ ప్రభావం ఇదే విధంగా సాగితే, ప్రపంచం ఆర్థికంగా మరింత కష్టాల్లోకి కూరుకుపోతోంది.

ముఖ్యంగా ఇతర దేశాల్లో కంటే భారత్ లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందనే లెక్కలు వస్తున్నాయి.జనాభా పరంగా చూస్తే చైనా తర్వాతి స్థానంలో భారతదేశం ఉంది.

చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ ఆదేశం చాలా వరకు కంట్రోల్ చేయగలిగింది.అంతేకాకుండా యధావిధిగా తమ కార్యకలాపాలను చైనా ప్రారంభించింది.

కానీ ఇండియాలో మాత్రం ఇంకా లాక్ డౌన్ కొనసాగుతోంది.దీని కారణంగా మొత్తం అన్ని రంగాలు లాక్ అయిపోయాయి.అలాగే పారిశ్రామిక ఉత్పత్తులకు డిమాండ్ పడిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.దీని కారణంగా ఉద్యోగాలపైన ఈ ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.ఎలా చూసుకున్నా ఈ పరిస్థితి నుంచి భారతదేశం గట్టెక్కేందుకు చాలా నెలల సమయమే పడుతుంది.ఈ ఆర్థిక మాంద్యం కారణంగా భారతదేశం మరింత పేద దేశం గా మారే అవకాశాలు లేకపోలేదు.

లాక్ డౌన్ నిబంధనలు విధించిన రెండు మూడు వారాల్లోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే, ఒకవేళ లాక్ డౌన్ మరికొంత కాలం పొడిగిస్తే భారతదేశం కోలుకోలేని విధంగా నష్టపోవడం ఖాయమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.పరిస్థితులు ఎలా ఉన్నా అన్ని ఆటుపోట్లను భారతదేశం ఇప్పుడు తప్పనిసరిగా ధైర్యంగా ఎదుర్కోవలసి ఉంది.

#Economy #Corona Effect #Lockdown #India

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Economy Situation Employees Corona Effect Related Telugu News,Photos/Pics,Images..