షార్జా లో భారతీయ డ్రైవర్ కి ఊహించని బహుమతి..!!

రెక్కాడితే కాని డొక్కాడని ఓ వక్తి డబ్బు సంపాదన కోసం తన సొంత రాష్ట్రం కేరళా వదిలి.షార్జాకి డ్రైవర్ పనికోసం వెళ్ళాడు.

 Lottery, Sharjah, Kerala, Driver, Won Lottery-TeluguStop.com

ఇంటికి నెల నెలా డబ్బులు పంపడం మాత్రమే జరుగుతోంది కానీ బవిష్యత్తు కోసం డబ్బులు వెనకేసు కోవడం మాత్రం సాధ్య పడటంలేదని ఆందోళన చెందుతున్నాడు.ఈ క్రమంలోనే ఆతడు షార్జాలో ఓ లాటరీ టిక్కట్టు కొనుగోలు చేశాడు.

దాంతో ఊహించని తీరిలో అతడిని అదృష్టం వరించింది.

అతడి పేరు అబ్దుల్ సలాం.

కేరళాకి చెందిన యితడు ఎన్నో ఏళ్ళుగా షార్జాలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అప్పుడప్పుడు లాటరీ టిక్కెట్లు కొనుగులు చేసే వాడు.

కొన్ని రోజుల క్రితం 54 డాలర్లు వెచ్చించి ఓ టిక్కెట్టు కొనుగులు చేశాడు.అయితే ఇలా లాటరీ కొనుగోలు చేసిన విషయం ఎవరికీ చెప్పలేదని.

తన భార్యకి కూడా తెలియదని కానీ ఓ మాల్ లో నిర్వహించిన రాఫెల్ డ్రాలో నేను కొన్న టిక్కెట్టు గెలుచుకుందని తెలిపాడు.

అతడు కొనుగులు చేసిన ఈ రాఫెల్ టిక్కెట్టుకి అక్షరాలా 2 .6 డాలర్లు రావడంతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడు.కలలో కూడా నేను ఇది ఊహించలేదని.

కేరళా నుంచీ ఒత్తి చేతులతో షార్జా వచ్చిన నేను ఇప్పుడు కోటీశ్వరుడు అవ్వడం ఎంతో సంతోషంగా ఉందని 50 ఏళ్ళు కష్టపడి పనిచేసినా ఇంత మొత్తం నేను సంపాదించలేనని అంటున్నాడు.ఈ వచ్చిన డబ్బులో కొంత ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగిస్తానని తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube