కరోనాతో మృతి చెందిన ప్రముఖ భారతీయ హృద్రోగ నిపుణుడు

కరోనాతో సామాన్యులతో పాటు చాలా మంది ప్రముఖులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.ఎంతో మందికి ప్రాణాలు పోసిన డాక్టర్లు కూడా కరోనాకి బలైపోతున్నారు.

 Indian Doctor Jitendra Kumar Rathod Died With Corona Virus, Covid-19, Britain, E-TeluguStop.com

ఇండియాలో కరోనా మరణాలు తక్కువగానే ఉన్న ఇతర దేశాలలో మాత్రం వేల సంఖ్యలో ఉన్నాయి.ఎక్కువగా వయస్సు మళ్ళిన వారు కరోనా కారణంగా ప్రాణాలు వదిలేస్తున్నారు.

ఇక తాజాగా ఈ కరోనా కారణంగా ప్రముఖ హృద్రోగ నిపుణుడు, బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ లో అసోసియేట్ స్పెషలిస్ట్ గా విధులు నిర్వహిస్తూ, ఎందరో ప్రముఖులకు ఆపరేషన్లు చేసిన డాక్టర్ జితేంద్ర కుమార్ రాథోడ్ కరోనా వైరస్ సోకి ఈ ఉదయం మరణించారు.ఈ విషయాన్ని కార్డిఫ్ అండ్ వేల్ యూనివర్శిటీ హెల్త్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.

ఇదొక దుర్వార్త.కార్డియో-థారోసిక్ సర్జరీలో ఎంతో అనుభవజ్ఞులైన జితేంద్ర ప్రసాద్ ఇక లేరు.వేల్స్ లోని యూనివర్శిటీ హాస్పిటల్ లో ఆయన తుది శ్వాస విడిచారు అని ట్విట్టర్ లో ప్రకటించారు.1977లో బాంబే యూనివర్శిటీలో వైద్య విద్యను అభ్యసించిన జితేంద్ర కుమార్, ఆపై యూకేకు వెళ్లి, వైద్య రంగంలో దశాబ్దాల పాటు సేవలందించారు.ఇటీవల ఆయనకు కరోనా వైరస్ సోకింది.గత కొంత కాలంలో జనరల్ ఇన్టెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి ఆయనకీ చికిత్సను అందిస్తున్నారు.యూకేలో సుమారు 15 లక్షల మంది భారత సంతతి ఉండగా, వైద్య విభాగంలో ఎంతో మంది సేవలందిస్తున్నారు.ఇక హృద్రోగ నిపుణుడుగా జితేంద్ర ప్రముఖుల జాబితాలో ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube