దుబాయ్: లైంగిక వేధింపుల ఆరోపణలు... భారతీయ డాక్టర్‌కు క్లీన్‌చీట్  

నిజం నిప్పులాంటిది.ఎన్ని రకాలుగా దానిని దాచాలని ప్రయత్నించినా, ఏళ్లు గడిచినా సత్యం మాత్రం ఏదో ఒక సందర్భంలో బయటకు రాక తప్పదు.

TeluguStop.com - Indian Doctor Cleared Of Molestation Charges In Uae

ఈ క్రమంలో పవిత్రమైన వైద్య వృత్తిలో ఉంటూ చికిత్స కోసం వచ్చిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఇన్నాళ్లు ఆరోపణలు ఎదుర్కొన్న భారత సంతతికి చెందిన వైద్యుడికి దుబాయ్ కోర్ట్ క్లీన్ చీట్ ఇచ్చింది.

వివరాల్లోకి వెళితే.

TeluguStop.com - దుబాయ్: లైంగిక వేధింపుల ఆరోపణలు… భారతీయ డాక్టర్‌కు క్లీన్‌చీట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దుబాయ్‌లో నివసిస్తున్న 31 ఏళ్ల ఇండో అమెరికన్ బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలాన్ని దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ వినింది.దీని ప్రకారం ఈ ఏడాది ఆగస్టులో బాధితురాలు బుర్ దుబాయ్‌లోని ఓ క్లినిక్‌కు వెళ్లింది.

అక్కడ విధులు నిర్వర్తిస్తున్న 42 ఏళ్ల భారతీయ వైద్యుడు ఆమె చెంపపై ముద్దు పెట్టుకోవడంతో పాటు రెండు సార్లు కౌగిలించుకున్నట్లు తెలిపింది.

ముఖంపై ముడతలు తొలగించుకునేందుకు తాను అతని వద్దకు వెళ్లినట్లు బాధితురాలు చెప్పింది.తన సమస్య విన్న అతను ప్లాస్టిక్ సర్జరీ గురించి చర్చించాలని చెప్పి కన్సల్టేషన్ గదికి రమ్మన్నాడని తెలిపింది.ముఖంపై ముడతలకు తోడు, ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ జరగడంతో మరింత భయపడిన తాను డాక్టర్‌ని సంప్రదించానని చెప్పింది.

కానీ ఆ గదిలో సదరు వైద్యుడు తన రెండు చేతులను చెంపపై వుంచి, రెండు సార్లు ముద్దు పెట్టుకున్నట్లు చెప్పింది.అంతేకాకుండా తన పెదవులపై ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని.

దీనిని గమనించి భయపడిన తాను కన్సల్టేషన్ గది నుంచి బయటకొచ్చినట్లు ఆమె వాంగ్మూలంలో తెలిపింది.

దీంతో అతను తనను ఓదార్చేందుకు ప్రయత్నించాడని.

కానీ తాను విశ్రాంతి తీసుకుంటానని చెప్పి బయటకొస్తుండగా.ఆ వైద్యుడు మళ్లీ కౌగిలించుకుని మరోసారి ముద్దు పెట్టుకున్నాడని బాధితురాలు వెల్లడించింది.

వెంటనే క్లినిక్ నుంచి ఎలాగోలా తప్పించుకుని దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.రంగంలోకి దిగిన పోలీసులు అతనిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు నమోదు చేశారు.

అయితే సదరు డాక్టర్ దోషి కాదని నివేదికలో తేలింది.దీనిపై ప్రాసిక్యూషన్‌ దుబాయ్ కోర్టులో సవాల్ చేసింది.

ఇందుకు సంబంధించి త్వరలో విచారణ జరగనుంది.

#WrinklesOn #Dubai Police #Clean Cheat #Plastic Surgery #DubaiCourt

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Doctor Cleared Of Molestation Charges In Uae Related Telugu News,Photos/Pics,Images..