యుద్ధ ట్యాంకర్ తో బాటిల్ క్యాప్ ఛాలెంజ్  

Military Tank Used For Bottle Cap Challenge-telugu Viral News Updates,viral In Social Media

సోషల్ మీడియాలో గత కొద్దీ రోజులుగా బాటిల్ క్యాప్ ఛాలెంజ్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్ కోసం ఒకొక్కరు ఒకొక్క విధంగా బాటిల్ క్యాప్ లను తీస్తున్నారు. బ్యాక్ కిక్‌తోనే కాకుండా..

యుద్ధ ట్యాంకర్ తో బాటిల్ క్యాప్ ఛాలెంజ్ -Military Tank Used For Bottle Cap Challenge

జంతువులు, వివిధ వస్తువులను ఉయోగించి కూడా బాటిల్ క్యాప్ ఛాలెంజ్‌ వీడియోలు చేస్తున్నారు. ఆ మధ్య బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ కూడా గాలి ఊది మరి బాటిల్ క్యాప్ ని తీసి తనదైన శైలి లో మెసేజ్ ఇచ్చాడు.

ఐతే ఇప్పుడు భారత సైన్యం వంతు వచ్చింది. భారత సైన్యం కూడా తమదైన శైలి లో బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ని చేశారు. కాలి తో బ్యాక్ కిక్ లాంటివి కాకుండా బాటిల్ క్యాప్ తీయడానికి ఏకంగా యుద్ధ ట్యాంకర్ ని రంగంలోకి దింపారు.

ట్యాంకర్ ముందు ఉండే మెయిన్ గన్ కోన తో బాటిల్ మూత తీసి అందరిని ఆశ్చర్యపరచారు.

ఇప్పటివరకు రకరకాల బాటిల్ క్యాప్ ఛాలెంజ్ ఛాలెంజ్ లు చూశాం, కానీ ఈ ఛాలెంజ్ మాత్రం అన్నిటికీ భిన్నంగా ఉండడం తో నెటిజన్లు తెగ ఫిదా అయిపోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఇండియన్ డిఫెన్స్ ఫోర్సె్స్’ పేజీలో ఈ వీడియోను పోస్టు చేయగా,ఇప్పటివరకు ఈ వీడియోను 38 వేల మంది వీక్షించడం గమనార్షం.