అమెరికాలో తెలుగు యువకుడు మృతి...గంటకు పైగా  

Indian Died In America Road Accident-road Accident,telugu Nri News,ఇండియన్స్,హైదరాబాద్‌

అమెరికాలో స్థిరపడాలనే కోరికతో ఎంతో మంది ఇండియన్స్ ఎన్నో ఆశలతో తమ ప్రతిభని కూడగట్టుకుని తమ కలని నెరవేర్చుకోవాలని అమెరికా వెళ్తారు. దేశం కాని దేశంలో సైతం ఎన్నో వ్యయప్రయాసలు పడుతూ తమ నెర అహర్నిశలు కష్టపడుతారు. కానీ ఆ కల నెరవేరేలోగానే అనుకోని ప్రమాదాల వలనో, మరే ఇతరాత్రా కారణాల వలనో అసువులు బాస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు..

అమెరికాలో తెలుగు యువకుడు మృతి...గంటకు పైగా-Indian Died In America Road Accident

తాజాగా జరిగిన ఓ దుర్ఘటన కూడా ఈ కోవకు చెందినదే హైదరాబాద్ కి చెందిన సాహిత్ రెడ్డి అనే ఓ యువకుడు తన తల్లి తండ్రులని ఉన్నతమైన స్థానంలో చూడాలని కలలు కన్నాడు. తన ఇంజనీరింగ్ చదువుని హైదరాబాదు లోని సీబీఐటీ కాలేజీలో పూర్తి చేసుకుని ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళాడు. అక్కడ స్థానికంగా ఉన్న ఓ కన్సల్టెన్సీలో జాబ్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నాడు కూడా అయితే నార్త్ కరోలినాలో ఉండే సాహిత్ రెడ్డి.రోజువారీగానే జిమ్‌కు వెళ్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని వాహనం డీ కొట్టడంతో దాదాపు గంటకి పైగా ప్రాణాలతో పోరాడి మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు. ఈ ఘటన తెలిసిన వెంటనే స్నేహితులు, సన్నిహితులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న సాహిత్ తల్లి తండ్రులకి ఈ విషయం తెలియడంతో కన్నీరు మున్నీరవుతున్నారు.