భారత్- అమెరికాల మధ్య వారథిలా ప్రవాస భారతీయులు : బీజేపీ నేత గురుప్రకాశ్ పాశ్వాన్

భారత్ – అమెరికాల మధ్య ప్రవాస భారతీయులు వారథిలాగా వ్యవహరిస్తున్నారని అన్నారు బీజేపీ నేత, జాతీయ అధికార ప్రతినిధి గురుప్రకాశ్ పాశ్వాన్.ఆయన రచించిన తాజా పుస్తకం ‘Makers of Modern Dalit History’ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఆయన పలు నగరాల్లో పర్యటిస్తున్నారు.

 Indian Diaspora 'bridge' Between India And America: Bjp Spokesperson Guru Prakas-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన ‘‘జైపూర్ లిటరరీ ఫెస్టివల్’’లో గురు ప్రకాశ్ పాల్గొన్నారు.ఈ ఫెస్టివల్‌లో సెర్చింగ్ ఈక్విటీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో చోటు చేసుకున్న మార్పులు, భారత రాజకీయాలు తదితర అంశాలపై సెషన్ జరిగింది.

ఈ సందర్భంగా జాతీయ మీడియా సంస్థ పీటీఐతో గురుప్రకాశ్ మాట్లాడుతూ.ప్రవాసులే దేశానికి నిజమైన రాయబారులని ప్రధాని మోడీ చెప్పారని గుర్తుచేశారు.ఇండియన్ కమ్యూనిటీ ఇక్కడికి వచ్చి సామ్రాజ్యాలను నిర్మించిందని పాశ్వాన్ అన్నారు.నేడు భారతీయ అమెరికన్లు గూగుల్, మైక్రోసాఫ్ట్‌తో సహా అగ్రశ్రేణి సంస్థలకు సీఈవోలుగా వున్నారని ఆయన ప్రశంసించారు.

భారతీయులు సంఖ్యా పరంగా తక్కువగా వుండొచ్చు.కానీ అమెరికా ఆర్ధిక వ్యవస్థలో వారి వాటా భారీగా వుంటుందన్నారు.

Telugu America, Guruprakash, Houston, India, Indian Diaspora, Indiandiaspora, Ja

తాము ఈ బంధాన్ని మరింతగా కొనసాగిస్తామని పాశ్వాన్ పేర్కొన్నారు.మెరుగైన ఇండో యూఎస్ ద్వైపాక్షిక సంబంధాల కోసం తాము ఈ ఇంటర్‌ఫేస్‌ను కొనసాగిస్తామని ఆయన చెప్పారు.తన పర్యటనలో భాగంగా వాషింగ్టన్ డీసీ, హ్యూస్టన్ , న్యూజెర్సీతో సహా అనేక నగరాలలోని ఇండియన్ కమ్యూనిటీతో పాశ్వాన్ భేటీ అయ్యారు.భారతదేశ తొలి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికవడాన్ని సరైన విధంగా జరుపుకోలేదని పాశ్వాన్ అభిప్రాయపడ్డారు.

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎంపిక భారతదేశంలోని చాలా మంది జీవితాలపై ప్రభావం చూపిందని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube