యూకే: జీ 7 సదస్సులో కరోనా కలకలం.. ఇద్దరు భారతీయ దౌత్యవేత్తలకు పాజిటివ్

జీ 7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి యూకే వెళ్లిన భారతీయ ప్రతినిధి బృందంలోని ఇద్దరు సభ్యులకు కోవిడ్ 19 పాజిటివ్ తేలినట్లు బ్రిటీష్ మీడియా కథనాలు ప్రచురించింది.ప్రతినిధి బృందంలో భాగమైన భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ ఈ విషయాన్ని అంగీకరించారు.

 Indian Delegates Test Positive At Britain Hosts G7 Summit Foreign Ministers Meet-TeluguStop.com

ఈ మేరకు జై శంకర్ ట్వీట్ చేశారు.నిన్న సాయంత్రం వీరికి కోవిడ్ కోవిడ్ నిర్థారణ అయినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఇతరుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వర్చువల్ మోడ్‌లో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు జైశంకర్ చెప్పారు.

 Indian Delegates Test Positive At Britain Hosts G7 Summit Foreign Ministers Meet-యూకే: జీ 7 సదస్సులో కరోనా కలకలం.. ఇద్దరు భారతీయ దౌత్యవేత్తలకు పాజిటివ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా జీ 7 సదస్సుకు హాజరు కావాల్సిందిగా యూకే .భారత్‌ను ఆహ్వానించింది.భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాకు కూడా ఆహ్వానించింది.

జూన్‌లో జరగబోయే ఈ కార్యక్రమానికి తీర ప్రాంతంలో వున్న కార్న్‌‌వాల్ రిసార్ట్ వేదిక కానుంది.ప్రపంచంలో ఆర్ధికంగా అభివృద్ధి చెందిన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాల కూటమే జీ 7.అయితే తొలుత గ్రూప్‌లోని విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు జైశంకర్ నేతృత్వంలోని భారత బృందం యూకే చేరుకుంది.ఈ సమావేశంలో కరోనా , పర్యావరణ మార్పులు, సాంకేతిక అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, స్వేచ్ఛా వాణిజ్యంపై చర్చించనున్నారు.

కాగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్.యూకే హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్‌ను కలిశారు.

ఈ సందర్భంగా యూకే ఇండియా కొత్త మైగ్రేషన్ పాలసీపై సంతకం చేశారు.అలాగే ఈ సమావేశానికి హాజరైన అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌తో జై శంకర్ భేటీ అయ్యారు.

కాగా దేశంలో 50 ఏళ్ళు దాటిన వారందరికీ మూడో వ్యాక్సిన్ ఇవ్వాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది.క్రిస్మస్ నాటికి దేశంలో కోవిడ్ నిర్మూలన జరగాలని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం భావిస్తోంది.బ్రిటన్‌లో వ్యాక్సినేషన్ కోసం ఫైజర్ బయో ఎన్ టెక్, ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా, మోడెర్నా వ్యాక్సిన్లను వినియోగిస్తున్నారు.దేశంలో ఇప్పటి వరకు 36.6 మిలియన్ల మంది వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.అయితే 510 మిలియన్లకు పైగా కోవిడ్ డోసులను ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

#Covid Vaccine #G7 Summit #IndianDelegates #COVID Positive

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు