హీరోయిన్స్ తో లవ్ ఎఫైర్స్ ఉన్న ఆటగాళ్లు ఎవరంటే..?

ఇండియాలో క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం.క్రికెటర్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు.

 Indian Cricketers Who Are Having Love Affairs With Heroines-TeluguStop.com

అలాంటి క్రికెటర్లు హీరోయిన్లతో ప్రేమలో పడిన వార్తలు అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటాయి.ఇప్పటి వరకూ క్రికెటర్లకు, హీరోయిన్లకు పెళ్లిళ్లు చాలానే జరిగాయి.

హీరోయిన్లతో ప్రేమలో క్రికెటర్లు కొన్ని జంట‌లు పెళ్లిపీట‌లెక్కాయి.ఇంకొన్ని జంటలు ఏవేవో కారణాలతో విడిపోయాయి.

 Indian Cricketers Who Are Having Love Affairs With Heroines-హీరోయిన్స్ తో లవ్ ఎఫైర్స్ ఉన్న ఆటగాళ్లు ఎవరంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే అలాంటివారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.క‌పిల్ దేవ్ బాలీవుడ్ హీరోయిన్ సారిక మ‌ధ్య చాలా రోజులు ప్రేమాయ‌ణం న‌డిచింది.

కానీ ఏ కార‌ణాల వ‌ల్లో వారు విడిపోయారు.రవిశాస్త్రి కూడా లవ్ ఎఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చాయి.

అమృతా సింగ్ గురించి అప్పట్లో మీడియా పెద్ద కూడై కూసింది కూడా.ర‌విని అమృత బ‌హిరంగంగా ముద్దుపెట్టుకోవ‌డం అప్ప‌ట్లో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

ఆ తర్వాత అమృత బాలీవుడ్ న‌టుడు, త‌న క‌న్నా ఏడేళ్ల చిన్న‌వాడైన సైఫ్ అలీఖాన్ ను వివాహం చేసుకోగా ర‌విశాస్త్రి రీతూ సింగ్ ను పెళ్లాడాడు.సౌర‌వ్ గంగూలీ పెళ్ల‌యిన త‌రువాత హీరోయిన్ న‌గ్మాతో ప్రేమాయ‌ణం న‌డ‌ప‌డం వివాదాస్ప‌దంగా మారింది.

ఆ తర్వాత వారి గురించి అంతగా వార్తలు రాలేదు.యువ‌రాజ్ సింగ్ కూడా క్రికెట్ లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే బాలీవుడ్ హీరోయిన్ కిమ్ శ‌ర్మతో ప్రేమ‌లో ప‌డ్డాడు.

కానీ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ ఇద్ద‌రూ విడిపోయారు.

భార‌త జ‌ట్టులో అత్యంత విజ‌య‌వంత‌మైన కెప్టెన్ గా పేరుతెచ్చుకున్న మ‌హేంద్ర సింగ్ ధోనీ కూడా బాలీవుడ్ హీరోయిన్ల‌తో ప్రేమాయ‌ణం న‌డిపాడు.

బాలీవుడ్ లో అడుగుపెడుతూనే సంచ‌ల‌నంగా మారిన దీపికా ప‌దుకునే పై ధోనీ ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌ర్చాడు.అయితే అదే స‌మ‌యంలో యువ‌రాజ్ కూడా సీన్ లోకి ఎంట‌ర‌యి దీపిక ను త‌న‌వైపు ఎట్రాక్ట్ చేసుకున్నాడ‌ని, దీంతో ధోనీ ప‌క్క‌కు త‌ప్పుకున్నాడ‌ని చెప్పుకుంటారు.

లక్ష్మీరాయ్ తో కూడా ధోనీతో ఎఫైర్ నడిపినట్లు అప్పట్లో పెద్ద వార్తలే వచ్చాయి.వీరిద్ద‌రూ కొన్నాళ్లు డేటింగ్ కూడా చేశారు.ధోనీ కెప్టెన్ గా ఉన్న చెన్నై సూప‌ర్ కింగ్స్ కు ల‌క్ష్మీ రాయ్ బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉండ‌డానికి ధోనీనే కార‌ణం.త‌ర్వాత వారిద్దరూ విడిపోయారు.

విరాట్ కోహ్లీ ఇషా బెల్లాతో రెండు ఏళ్లు లవ్ ఎఫైర్ నడిపాడు.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఈ ఇద్దరూ విడిపోయారు.

అతియాశెట్టి కన్నా ముందే కేఎల్ రాహుల్ నిధి అగర్వాల్ తో లవ్ ఎఫైర్ నడిపాడు.అప్పుడప్పుడు వీళ్లకి కెమెరాలకు కూడా చిక్కారు.

అయితే, తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని వీళ్లు చెప్పుకొచ్చారు.న‌టి సాగ‌రిక ఘ‌ట్గేను వివాహం చేసుకున్న మాజీ ఫాస్ట్ బౌల‌ర్ జ‌హీర్ ఖాన్, అంత‌కుముందు ఇషా శ‌ర్వాణితో సుదీర్ఘ కాలం ప్రేమాయ‌ణం న‌డిపాడు.2005లో మొద‌లైన వీరి స్నేహం ఎనిమిదేళ్ల‌పాటు సాగి 2013లో ముగిసిపోయింది.రిషభ్ పంత్ – ఇషా నేగీ, పృథ్వీ షా – ప్రాచి సింగ్, ఇషాన్ కిషన్ – అదితి హుండియా పేర్లు ఈ లిస్ట్ లో ప్రముఖంగా విన్పిస్తున్నాయి.

#Ravi Sastri #ZaheerKhan #Kapil Dev #Heroins #Love Affair's

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు