వన్డే ప్రపంచ కప్ ( ODI World Cup )భారత్ నుంచి చేజారింది ఇది ప్రతి భారతీయుడు ని ఎంతగానో బాధించే విషయం.అలాగే మరో నాలుగేళ్ల పాటు ఈ బాధను భరించాల్సిందే.
ఇప్పటికే 12 ఏళ్లుగా ప్రపంచకప్ మనకు దూరంగానే ఉంది.చివరిసారి ధోని సారధ్యంలో ప్రపంచ కప్ గెలిచిన భారత్( India ) మరోసారి కప్పును కౌగిలించుకోవాలని ఎంతగానో ఎదురు చూసింది.
కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేవలం ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయి కప్పును చేజార్చుకుంది.భారత్ క్రికెట్ టీం ఆడిన 11 మ్యాచ్ లో 10 మ్యాచ్ లు గెలిచి కేవలం ఫైనల్ మ్యాచ్ లో ఓటమి పాలవడం నిజంగా అందరిని ఎంతగానో బాధించింది.

అయితే ఆట అన్నాక గెలుపు ఓటమి సర్వసాధారణమే కానీ 2023 ప్రపంచ కప్ మనకు ఎంతో గొప్ప క్షణాలను అందించింది అంతకుమించి గొప్పగానే మన భారతదేశం గర్వపడే విధంగా మన ఆటగాళ్లు తమ పెర్ఫార్మెన్స్ నిరూపించుకున్నారు ఇప్పుడు ఒకసారి 2023 ప్రపంచ కప్ లో మన భారత ఆటగాళ్లు అందుకున్న రికార్డ్స్ గమనిస్తే మాన్ అఫ్ ది టోన్మెంట్ గా కోహ్లీ ఎక్కువ రన్స్ సాధించి కప్పును అందుకున్నాడు.అలాగే మోస్ట్ వికెట్స్ తీసింది షమీగా( Shami ) రికార్డు సాధించగా హైయెస్ట్ యావరేజ్ కోహ్లీ సాధించాడు.ఇక కోహ్లీ పేరు మీదగా ఎక్కువ ఫోర్లు కొట్టిన రికార్డు కూడా దక్కింది.అలాగే ఎక్కువ 50 సాధించిన ఆటగాడిగా కోహ్లీ( Kohli ) నిలిచాడు.రోహిత్( Rohith ) కూడా ఎక్కువ సిక్స్ లు కొట్టిన ఆటగాడిగా ప్రపంచకప్ చరిత్రలో నిలిచిపోగా, బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ షమీ పేరు మీదుగా రికార్డు అయ్యాయి.

బెస్ట్ బౌలింగ్ యావరేజ్ కూడా షమీ పేరుగానే పేరుపై ఉండగా, బెస్ట్ బౌలింగ్ స్ట్రైక్ రేటు కూడా అతడే దక్కించుకున్నాడు.అలాగే ఎక్కువ సార్లు ఐదు వికెట్స్ తీసిన ఘనత కూడా ఆ షమీకే దక్కింది.ఇలా షమీ 5 బౌలింగ్ రికార్డ్స్ దక్కించుకోగా కోహ్లీ నాలుగు బ్యాటింగ్ రికార్డ్ దక్కించుకున్నాడు.
అందుకే భారత్ ఓడిపోయినందుకు కాదు గొప్పగా ఆడినందుకు గర్వపడాల్సిన సందర్భం ఇది.