భారత్ క్రికెటర్లు 8 నిమిషాల్లో ఇక 2 కిలోమీటర్లు పరుగెత్తాల్సిందే!

భారత జాతీయ,క్రికెట్ జట్టుకు ఎంపికైన ప్రతి ఒక్క క్రికెటర్ కు పరీక్ష పెడుతోంది.టీమిండియా క్రికెటర్లకు యో-యో టెస్ట్ ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలుసు.

 Indian Cricketers Have To Run Another 2kilometers In 8 Minutes, Indian Cricketer-TeluguStop.com

మైదానంలో మెరుగైన ఆట ప్రదర్శించిన యో-యో టెస్ట్ లో విఫలమైతే జట్టులో చోటు దక్కదు.తాజాగా భారత మహిళల జట్టు సభ్యులందరూ యో-యో టెస్ట్ లో పాస్ అయ్యారు.

ఇక భారత్ క్రికెటర్ల ఫిట్ నెస్ స్థాయిని పెంచేందుకు బీసీసీఐ యో-యో టెస్ట్ నిర్వహించింది అన్న విషయం తెలిసిందే.ఇప్పుడు తాజాగా క్రికెటర్ల ఫిట్నెస్ స్థాయిని పరీక్షించేందుకు ఇప్పటికే అమల్లో ఉన్న యో-యో టెస్ట్ తో పాటు మరో కొత్త తరహా పరీక్షలు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.

పరుగులో వేగాన్ని బట్టి ఆటగాళ్ల ఫిట్ నెస్ ను కొలవమన్నారు.

పేస్ బౌలర్ అయితే రెండు కిలోమీటర్ల పరుగును 8 నిమిషాల 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది.

స్పిన్నర్లు, వికెట్ కీపర్,బ్యాట్స్ మెన్ కు మరో పదిహేను సెకండ్ల అదనపు అవకాశం కల్పిస్తూ 8 నిమిషాల 30 సెకండ్ల గరిష్ట సమయము నిర్దేశించడం జరిగింది.కాంట్రాక్టు ప్లేయర్ తో పాటు జట్టులోకి వచ్చే అందరికీ ఇది వర్తిస్తుంది.

సంవత్సరానికి మూడు సార్లు ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.ఇంగ్లాండ్ లో జరగబోయే ఓవర్ల పరిమిత ఈ సిరీస్ లో పాల్గొనే ఆటగాళ్లు ముందుగా ఈ పరీక్షను ఎదుర్కొన్నారు.

క్రికెటర్లు సాధారణంగా 6 నిమిషాల్లోనే 8 కిలోమీటర్లు పూర్తి చేస్తారు.కాబట్టి ఇప్పుడు కొత్తగా పెట్టిన పరీక్ష వల్ల క్రికెటర్లు ఇబ్బంది పడకపోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube