ఐపీఎల్ ఆటగాడికి కరోనా...!

కరోనా మహమ్మారి భారత క్రికెట్ లోకి కూడా ప్రవేశించింది.ఐపీఎల్ ఆటగాడు కర్ణాటక కు చెందిన కరుణ్ నాయర్ కు కరోనా సోకినట్లు తెలుస్తుంది.

 Indian Cricketer Karun Nair Tested Corona Positive , Indian Cricketer Karun Nair-TeluguStop.com

టీమిండియా తరపున ఆరు టెస్ట్ లు ,రెండు వన్డే మ్యాచ్ లు ఆడిన కరుణ్ నాయర్ టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత ట్రిఫుల్ సెంచరీ బాదిన భారత క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు.ఐపీఎల్ 2020 సీజన్ కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరపున కరుణ్ నాయర్ ఆడనుండగా అతడికి కరోనా సోకిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కర్ణాటక కు చెందిన కరుణ్ కు రెండు వారాల క్రితం కరోనా పాజిటివ్ రాగా, ఈ విషయాన్నీ కర్ణాటక క్రికెట్ అసోషియేషన్ గోప్యంగా ఉంచింది.

అయితే తాజాగా తడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అతడు ఈ మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకోవడం తో ఇటీవల పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.

దీనితో ఐపీఎల్ 2020 సీజన్‌ కోసం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో అతను త్వరలోనే చేరేందుకు మార్గం సుగుమమైంది.ఇదిలావుండగా కరోనా సమయంలో బీసీసీఐ ( భారత క్రికెట్ నియంత్రణ మండలి) కూడా పలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

యూఏఈకి ఐపీఎల్ కోసం క్రికెటర్లని పంపేముందు ఐదుసార్లు వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని టీమ్స్ ఫ్రాంఛైజీలకి.బీసీసీఐ ఆదేశించినట్లు తెలుస్తుంది.అక్కడికి వెళ్లిన వెంటనే ఒకసారి, క్వారంటైన్‌లో రెండు సార్లు.ఇలా మొత్తంగా.

ఐపీఎల్‌కి ముందు ప్రతి క్రికెటర్‌కి ఐదుసార్లు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని బీసీసీఐ సూచించినట్లు తెలుస్తుంది.

ఈ ఐదు పరీక్షల్లో నెగటివ్ వచ్చిన వారిని మాత్రమే బయో- సెక్యూర్ బబుల్‌లోకి బీసీసీఐ అనుమతించనున్నట్లు సమాచారం.

ఐపీఎల్ 2020 సీజన్‌లో సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.ఆగస్టు 20 తర్వాత టీమ్స్‌ని అక్కడికి పంపేందుకు ఫ్రాంఛైజీలు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube