అప్పుడు టీం ఇండియా టీ20 హీరో ఇప్పుడు కరోనా పోరాటంలో

ఇండియాకి టీ20 వరల్డ్ కప్ రావడంలో కీలక భూమిక పోషించిన బౌలర్ జోగిందర్ శర్మని క్రికెట్ గురించి తెలిసిన ఏ ఒక్కరు మరిచిపోరు.చివరి ఓవర్ లో బౌలింగ్ చేసి టీం ఇండియాకి తిరుగులేని విజయం అందించడంలో కీలక పాత్ర పోషించిన జోగిందర్ శర్మ తరువాత డిఎస్పీగా ఉద్యోగం సంపాదించాడు.

 Icc Salutes 'real World Hero' Joginder Sharma, Indian Cricket Team, Corona Virus-TeluguStop.com

ఆ సిరీస్ తర్వాత టీం ఇండియాలో ఎక్కువగా ఆడే అవకాశం రాకపోయినా జోగిందర్ శర్మ ఐపీఎల్, దేశవాళీలో కెరియర్ కొనసాగించాడు.ఇక క్రికెట్ కెరియర్ కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పోలీస్ ఆఫీసర్ గా తన డ్యూటీ మొదలెట్టాడు.

హరియాణా పోలీస్‌ విభాగంలో డీఎస్పీగా ప్రస్తుతం కొనసాగుతున్న జోగిందర్ శర్మకి సంబందించిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తుంది.

ఈ నేపధ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ నడుస్తుంది.ఈ పరిస్థితిలో డిఎస్పీగా విపత్కర పరిస్థితుల్లో ప్రజల శ్రేయస్సు కోసం పోలీసుగా జోగిందర్‌ విధులు నిర్వర్తిస్తున్నాడని ఐసీసీ అతనిపై ప్రశంసలు కురిపించింది.

చాలా మంది క్రీడాకారులు స్పోర్ట్స్ ద్వారా పోలీసు ఉద్యోగాలు పొందారు.అయితే ఎవరు కూడా వారి విధులని నిర్వహించడం లేదు.

ట్వీట్‌ చేసింది.జోగిందర్‌ ఫొటోలను పోస్టు చేసింది.36 ఏళ్ల జోగిందర్‌ టీమిండియా తరఫున నాలుగేసి వన్డేలు, టీ20లు ఆడాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube