క్రికెట్ కంటే ఆరోగ్యమే ముఖ్యం… అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీమిండియా ప్లేయర్…!  

Ajinkya Rahane, bcci, ipl. UAE, rajasthan Royals, Delhi Capitals, Health Comes First Says Ajinkya Rahane - Telugu Ajinkya Rahane, Ajinkye Raehane, Bcci, Delhi Capitals, Health Comes First Says Ajinkya Rahane, Ipl. Uae, Rajasthan Royals

ఈ ఏడాది మార్చి నెల చివర్లో మొదలవ్వాల్సి ఐపీఎల్ 2020 సీజన్ కరోనా మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.కేవలం ఐపీఎల్ మాత్రమే కాకుండా టీ20 వరల్డ్ కప్, ఆసియా కప్ కూడా వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిందే.

 Indian Cricket Player Ajinkya Rahane Ipl 2020

ఇక తాజాగా సెప్టెంబర్ నవంబర్ నెలలో ఐపీఎల్ 2020 సీజన్ ను బీసీసీఐ యూఏఈ వేదికగా నిర్వహించాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది.సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 8 వరకు లీగ్ మ్యాచ్లను నిర్వహించే విధంగా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.

ఇక ఇందుకు సంబంధించి ఆటగాళ్లు వారి కుటుంబ సభ్యులు కూడా అక్కడికి తీసుకు వెళ్లేందుకు అనుమతి ఇస్తారో, లేదో అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది.

క్రికెట్ కంటే ఆరోగ్యమే ముఖ్యం… అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన టీమిండియా ప్లేయర్…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ సందర్భంగా టీమిండియా ప్లేయర్ అజింక్యా రహానె స్పందించాడు.

యూఏఈ దేశానికి ఆటగాళ్ల కుటుంబ సభ్యులను తీసుకువెళ్లేందుకు ఇంకా బీసీసీఐ, ఐపిఎల్ ఫ్రాంచైజీలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పుకొచ్చారు.అలా వారు నిర్ణయం తీసుకోవాలంటే ముఖ్యంగా ఆటగాళ్ల ఆరోగ్యం, అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

అయితే ఈ విషయంపై రెహనా మాట్లాడుతూ మామూలు సమయంలో యూఏఈ దేశానికి కుటుంబ సభ్యులను తీసుకువెళ్లేందుకు తాను ఇష్టపడేవాడిని అయితే ప్రస్తుతం పరిస్థితులు వేరుగా ఉండటం వల్ల ముఖ్యంగా కుటుంబ సభ్యుల ఆరోగ్యం అంశాలను పరిధిలో ఉంచుకొని ఆపై నిర్ణయం తీసుకుంటారని తెలియజేశారు.ఇది వరకు రోజులతో పోలిస్తే …ఇప్పుడు ఉన్న రోజులలో కచ్చితంగా తాను “క్రికెట్ కంటే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తా” అని చెప్పుకొచ్చాడు.

గత ఐదు నెలల నుండి లాక్ డౌన్ కారణంగా ఎలాంటి మ్యాచ్ లేకపోవడంతో పూర్తిగా కుటుంబ సభ్యులతో గడిపేందుకు అవకాశం లభించిందని తెలియజేశారు.అయితే ఇది వరకు అజింక్యా రహానే ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతుండగా, జరగబోయే ఐపీఎల్ 2020 నుండి ఢిల్లీ క్యాపిటల్స్ కోసం ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఆయన తెలియజేశారు.ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో సమర్థులైన ఆటగాళ్లు ఎందరో ఉన్నారని, వారితో కలిసి ఆడేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.

#Ajinkya Rahane #Ipl. UAE #Delhi Capitals #Ajinkye Raehane #BCCI

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Cricket Player Ajinkya Rahane Ipl 2020 Related Telugu News,Photos/Pics,Images..