దుబాయ్: చనిపోయి మరో ముగ్గురిని బ్రతికించిన భారతీయ బాలిక

పరాయి గడ్డపైనా భారతీయులు తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.కంటి వెలుగుగా భావించే కన్న బిడ్డ మరణాన్ని కలచివేస్తున్నా.

 Indian Couple In Uae Donate Daughters Organs-TeluguStop.com

ఆమె అవయవాలను దానం చేసి మరో తల్లి కళ్లలో ఆనందాన్ని నింపారు.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో కిర్తీ, అరుణ్ దంపతులు తమ ఆరేళ్ల కుమార్తె దేవిశ్రీతో కలిసి ఉంటున్నారు.

అయితే పల్మనరీ హైపర్‌ టెన్షన్, గుండె సంబంధిత సమస్యల కారణంగా గతేడాది దేవిశ్రీ చనిపోయింది.అంతటి బాధలోనూ తమకు కలిగిన కష్టం ఏ తల్లిదండ్రులకు కలగకూడదని భావించి చిన్నారి అవయవాలను దానం చేయడానికి ముందుకు వచ్చారు.

అలా దేవిశ్రీ అవయవాలను ముగ్గురికి దానం చేశారు.

ఇదే సమయంలో భారత్‌కే చెందిన దీపక్ జాన్ జాకోబ్, దివ్య ఎస్ అబ్రహంల ఏడేళ్ల కుమారుడు ఆదామ్ కిడ్ని వ్యాధితో బాధపడుతూ గత ఐదేళ్లుగా డయాలిసిస్‌ చేయించుకుంటున్నాడు.

అయితే ఆ బాబుకు సరిపోయే కిడ్నీ కోసం వైద్యులు ఎప్పటి నుంచో వెతుకుతున్నారు.

దీనిపై మొహమ్మద్ బిన్ రషిద్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్ సైన్సెస్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫర్హాద్ జనహి మాట్లాడుతూ.

ఆడమ్ గత నాలుగు సంవత్సరాలుగా తమ వెయిటింగ్ లిస్టులో ఉన్నాడని తెలిపారు.డయాలిసిస్ ఉన్నందున అతను పాఠశాలకు వెళ్లలేకపోయాడని, 400 మి.లీ కంటే ఎక్కువ నీరు త్రాగకూడదని చెప్పారు.తమ విచారణలో దేవిశ్రీ మూత్రపిండాలు ఆడమ్‌కు సరిపోతాయని అతని తల్లిదండ్రులకు తెలిపామని, ఆ సమయంలో వారి సంతోషానికి అవధుల్లేకుండా పోయిందని ఫర్హాద్ తెలిపారు.

రాస్ అల్ ఖైమాలో తన కుటుంబంతో నివసించే ఆడమ్ డయాలసిస్ కోసం వారానికి మూడు సార్లు దుబాయ్ రావాల్సి వచ్చేదని ఆయన చెప్పారు.

Telugu Daughters, Devisri, Donate, Indian, Indianuae, Organs, Telugu Nri-Telugu

కాగా దేవిశ్రీ రెండవ మూత్రపిండాన్ని అబుదాబికి చెందిన 15 ఏళ్ల బాలుడికి, ఆమె కాలేయాన్ని సౌదీ అరేబియాకి చెందిన ఓ వ్యక్తికి దానం చేశారు.దీనిపై దేవిశ్రీ తల్లిదండ్రులు మాట్లాడుతూ… తమ బిడ్డ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయిన తర్వాత తాము ఆమె అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.ఇది తమకు ఎంతో గర్వంగా ఉందని.

కానీ ఆ సమయంలో ఈ కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి తమకు మనసును దృఢపరచుకున్నామన్నారు.తమ బిడ్డ ఆత్మను మరో మూడు జీవితాల్లో చూస్తున్నామని అరుణ్ అన్నారు.

ప్రతి ఒక్కరూ అవయవదానానికి ప్రతిజ్ఞ చేయాలని ఆయన చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube