ఉద్యోగులను వ్యభిచారంలోకి, డైలీ టార్గెట్లు: భారతీయ దంపతుల అరెస్ట్

ముగ్గురు బంగ్లాదేశ్ మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన నేరంపై భారతీయ దంపతులకు సింగపూర్ కోర్టు 6 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.మల్కర్ సవ్లారామ్ అనంత్ 51, ప్రియాంక భట్టాచార్య రాజేశ్ (31) వీరిద్దరూ భార్యాభర్తలు.

 Indian Couple In Singapore Sentenced To Over Six Years In Prison For Exploiting-TeluguStop.com

వీరికి సింగపూర్‌లో రెండు హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ క్లబ్బులు ఉన్నాయి.ఈ క్లబ్బులలో ముగ్గురు బంగ్లాదేశ్ మహిళలు డ్యాన్సర్లుగా పనిచేస్తూ అనంత్ దంపతులతో కలిసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు.

భార్యాభర్తలిద్దరూ కలిసి రెండు క్లబ్‌లలో రోజువారీ కార్యకలాపాలను నిర్వహించేవారు.

Telugu Indiansingapore, Indian-Telugu NRI

ఈ ముగ్గురు మహిళలు విశ్రాంతి లేకుండా ప్రతిరోజూ పనిచేసేవారు.అంతేకాదు వీరికి టార్గెట్‌లు సైతం ఇచ్చేవారు.వీటిలో విఫలమైతే వీరి జీతాల్లో కోత విధిస్తూ అనంత్ దంపతులు వేధింపులకు గురిచేసేవారు.

ఈ క్రమంలో ఈ ముగ్గురిలో ఒక మహిళను పిలిచిన ప్రియాంక.నువ్వు కస్టమర్లతో బయటకు వెళ్లాలని చెప్పేదట.

దీనికి నిరాకరించిన బాధితురాలు తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని చెప్పగా, అందుకు 4,00,000 బంగ్లా టాకాలు చెల్లించాలని తేల్చిచెప్పింది.అంతేకాకుండా అపార్ట్‌మెంట్‌ను ఖాళీ చేయకుండా వారి పాస్‌పోర్టులు, వర్క్ పర్మిట్‌లు, మొబైల్ ఫోన్‌లను ప్రియాంక బలవంతంగా లాక్కొంది.

Telugu Indiansingapore, Indian-Telugu NRI

ఐదు నెలల పాటు వీరి వేధింపులు భరించిన ఆ మహిళ 2016 మే లో క్లబ్ నుంచి పారిపోగా….మిగిలిన ఇద్దరు మహిళలు అక్కడ పనిచేయడం మానేశారు.ముగ్గురు బాధితురాళ్లు పోలీసులను ఆశ్రయించడంతో అనంత్, రాజేశ్ పోలీసులు గతేడాది అరెస్ట్ చేశారు.మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం ప్రకారం.సింపూర్‌లో కార్మిక అక్రమ రవాణా కేసు నమోదు చేశారు.

Telugu Indiansingapore, Indian-Telugu NRI

ఇందులో ఈ దంపతుల నేరం రుజువవ్వడంతో ఇద్దరికీ 7,500 సింగపూర్ డాలర్లు జరిమానా విధించారు.అంతేకాకుండా అనంత్ మల్కర్ చెల్లించని వేతనాలపై మహిళల్లో ఒకరికి 4,878.31 సింగపూర్ డాలర్లు పరిహారంగా చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు.మహిళా చార్టర్ కింద మూడు వ్యభిచార సంబంధిత నేరాలపై ప్రియాంక దోషిగా తేలింది.మానవ అక్రమ రవాణా నిరోధక చట్టం ప్రకారం మొదటిసారి నేరానికి పాల్పడిన నేరస్థులకు పదేళ్ల జైలు, లక్ష జరిమానా, చెరకు గడతో ఆరు దెబ్బలు శిక్షగా విధిస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube