చైనాలో కరోనా కల్లోలం .. షాంఘైలో భయానకం, వ్యక్తిగత సేవలను రద్దు చేసిన భారత కాన్సులేట్

కరోనా పుట్టినిల్లు చైనాను మహమ్మారి వణికిస్తోంది.దేశ తూర్పు ప్రాంతంలో ప్రస్తుతం భారీ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.

 Indian Consulate In Shanghai Closes In-person Services As Covid Crisis Worsens I-TeluguStop.com

దేశ ఆర్ధిక రాజధాని షాంఘైతో పాటు మరో 23 చిన్న నగరాల్లోనూ వైరస్ విస్తరిస్తోంది.ఇందులో ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంటేనని అధికారులు చెబుతున్నారు.

పరిస్ధితి తీవ్రత దృష్ట్యా షాంఘై నగరంలో కఠిన లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు .ప్రజలను ఇళ్లలో నుంచి బయటకు రానివ్వకుండా… ఆహార పదార్థాలు, నిత్యావసరాలను ఇంటి వద్దకే చేరుస్తున్నారు.అయినప్పటికీ ఈ సాయం ఏ మూలకు సరిపోవడం లేదు.కొందరు ఆకలి తట్టుకోలేక దగ్గరలోని ఆహార కేంద్రాల మీద పడి దోచుకుంటున్నారు.కొన్ని చోట్ల తాగడానికి కనీసం మంచినీరు కూడా దొరకని పరిస్ధితి నెలకొంది.

ఈ పరిణామాల నేపథ్యంలో షాంఘైలోని భారత కాన్సులేట్ అప్రమత్తమైంది.

కార్యాలయంలో అన్ని రకాల వ్యక్తిగత సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.తూర్పు చైనా ప్రాంతంలోని భారతీయ పౌరులు.

అత్యవసర కాన్సులర్ సేవలను బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి పొందవచ్చని మంగళవారం జారీ చేసిన ప్రకటనలో తెలిపింది.అయితే కాన్సులేట్ కార్యాలయం రిమోట్ మోడ్‌లో పనిచేస్తూనే వుంటుందని.

అత్యవసర సేవల కోసం ఎప్పుడైనా సంప్రదించవచ్చని చెప్పింది.ఈ మేరకు సిబ్బంది ఫోన్ నెంబర్‌లను తెలియజేసింది.

వ్యక్తిగత సేవలను నిలిపివేసినప్పటికీ.ప్రస్తుతం షాంఘైలో వున్న 1000 మందికి పైగా భారతీయ పౌరులకు కౌన్సెలింగ్ సహా అవసరమైన సాయం అందిస్తున్నట్లు కాన్సుల్ జనరల్ డి నందకుమార్ పేర్కొన్నారు.

ప్రస్తుతం కాన్సులేట్‌ కార్యాలయంలోని సిబ్బందిలో 22 మంది ఇంటి నుంచే పనిచేస్తున్నట్లు నందకుమార్ చెప్పారు.

సిబ్బంది కానీ.

భారతీయ ప్రవాసులు కానీ కోవిడ్ బారినపడినట్లు ఎలాంటి సమాచారం అందనప్పటికీ.అంబులెన్స్ సేవలను అందించేందుకు, విమానాశ్రయానికి చేరుకునేందుకు కాన్సులేట్ కార్యాలయం తగిన ఏర్పాట్లు చేస్తోంది.

లాక్‌డౌన్‌లో వున్న లక్షలాది మందికి నగర అధికారులు ఆహారం, కూరగాయలను సరఫరా చేస్తున్నారు.అలాగే స్థానిక ప్రభుత్వం ద్వారా షాంఘైలోని భారతీయ కుటుంబాలకు కూడా కిరాణా సామాగ్రిని పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని నందకుమార్ చెప్పారు.

Telugu China, China National, Consulgeneral, Indianconsulate, Jilin Province, Sh

చైనా నేషనల్ హెల్త్ కమీషన్ (ఎన్‌హెచ్‌సీ) గణాంకాల ప్రకారం.బుధవారం షాంఘై నగరంలో 1,189 పాజిటివ్ కేసులు.ఎలాంటి లక్షణాలు కనిపించని 25,141 కేసులు నమోదయ్యాయి.ఈ పరిణామాలు నగర ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తున్నాయి.చైనాలోని ఇతర ప్రావిన్సుల్లోనూ కేసులు పెరుగుతున్నాయి.జిలిన్ ప్రావిన్స్‌లో 233, గ్వాంగ్‌డాంగ్‌లో 22, హైనాన్‌లో 14, జెజియాంగ్‌లో 12 కేసులు నమోదయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube