భారత్ లో పాక్ భారీ కుట్రకు పధకం... భగ్నం అయ్యింది  

Indian Coast Guard Apprehends Pakistani Boat With Drugs-india Pakistan War,indian Coast Guard Apprehends Pakistani Boat,pakistan,telugu Viral News Updates,viral In Social Media

పొరుగుదేశం పాకిస్థాన్ భారత్ లో భారీ కుట్ర కు పధకం వేసినట్లు తెలుస్తుంది. పాక్ కు చెందిన కొన్ని నౌకలు భారత్ లో మత్తు పదార్ధాలను అక్రమ మార్గం ద్వారా సరఫరా చేయడానికి తాజాగా ప్రయత్నం చేశాయి. అయితే తీర గస్తీ దళం అప్రమత్తతో వ్యవహరించడం తో పాక్ కుట్ర భగ్నం అయ్యింది..

భారత్ లో పాక్ భారీ కుట్రకు పధకం... భగ్నం అయ్యింది -Indian Coast Guard Apprehends Pakistani Boat With Drugs

వివరాల్లోకి వెళితే…పాకిస్థాన్ లోని కరాచీ కి చెందిన ఒక నౌక అరేబియా సముద్రం గుండా గుజరాత్ తీరంలోకి ప్రవేశించింది.

అయితే దానిని గమనించిన భారత తీర గస్తీ దళం ఆ నౌకను చుట్టుముట్టి దానిని స్వాధీనం చేసుకుంది. అయితే అందులో ఏముంది అని పరిశీలించగా భారీ స్థాయిలో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఏకంగా 200 కేజీల హెరాయిన్ అందులో లభించడం తో అంతర్జాతీయ మార్కెట్ లో దాని విలువ దాదాపు రూ.600 కోట్లు ఉంటుంది అని అధికారులు అంచనా వేస్తున్నారు.

యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ కలిసి చేసిన ఈ ఆపరేషన్ లో పెద్ద ఎత్తున భద్రతా దళాలు పాలుపంచుకున్నాయి. అయితే భారత్ ను దొంగ దెబ్బ తీయాలి అన్న ఉద్దేశ్యం తో పాక్ ఈ విధంగా భారత్ లో మాదక ద్రవ్యాలను పంపిణి చేసి దేశ యువతను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నట్లు కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. కొన్ని డ్రగ్ మాఫియా ముఠాల సాయం తో ఈ చర్యకు పాల్పడుతున్నారని, ఈ ముఠాలకు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సైతం సహకరిస్తుందని నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు సముద్రమార్గం ద్వారా మాత్రమే కాదు. రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల ద్వారా కూడా డ్రగ్స్ దేశంలోకి ప్రవేశించేలా పాక్ మూకలు ప్రయత్నిస్తున్నాయని నిఘా వర్గాలు హెచ్చిరిస్తున్నాయి.