2022లో పెళ్లి చేసుకున్న సెల‌బ్రిటీలు వీళ్లే... వివాహాలు ఎలా జ‌రిగాయంటే...

2022వ సంవత్సరంలో పలువురు సెలబ్రెటీలు పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యారు.అంతకుముందు 2020, 2021లో కరోనా కారణంగా బాలీవుడ్ నటి రిచా చద్దాతో సహా చాలా మంది తారలు కరోనా మహమ్మారి కారణంగా తమ వివాహాన్ని వాయిదా వేసుకున్నారు.

 Indian Celebrity Got Married In 2022 , Suraj Nambiar , Mouni Roy , Karishma Tann-TeluguStop.com

అయితే ఈ సంవత్సరం రిచా కూడా ఒక ఇంటిదయ్యింది.చాలా మంది ప్రముఖులు 2022లో వివాహం చేసుకున్నారు.

కొంతమందికి ఈ సంవత్సరం పిల్లలు కూడా కలిగారు.ఈ జాబితాలో అలియా భట్, నయనతార పేర్లు వినిపిస్తున్నాయి.2022లో ఏ సెలబ్రెటీలు తమ జీవిత భాగస్వామితో ముడివేసుకున్నారో ఒకసారి చూద్దాం.

మౌని రాయ్

ఈ సంవత్సరం ప్రారంభంలో, ప్రముఖ టీవీ సీరియల్ ‘నాగిన్’ ఫేమ్ నటి మౌని రాయ్ 2022 జనవరి 27 న గోవాలోని హిల్టన్ గోవా రిసార్ట్‌లో వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను సాంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు.మౌని రాయ్ స్నేహితురాలు, నటి మందిరా బేడీ ఈ వివాహానికి హాజరయ్యారు.మౌని రాయ్ ఈ సంవత్సరం ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో కనిపించింది.ఈ చిత్రంలో ఆమె విలన్ పాత్రను అద్భుతమైన రీతిలో పోషించింది.

కరిష్మా తన్నా

నటి కరిష్మా తన్నా ఫిబ్రవరి 5న ముంబైలో వరుణ్ బంగేరాతో కలిసి ఏడు అడుగులు వేసింది.కరిష్మా రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారు అయిన వరుణ్ బంగేరాను గుజరాతీ, దక్షిణ భారత సంప్రదాయాలలో వివాహం చేసుకుంది.ఈ ప్రత్యేకమైన సందర్భంలో పాస్టెల్ పింక్ లెహంగాలో కరిష్మా తన్నా చాలా అందంగా కనిపించింది.

Telugu Ali Fazal, Alia Bhatt, Bollywood, Karishma Tanna, Mouni Roy, Nayanthara,

ఫర్హాన్ అక్తర్

నటుడు ఫర్హాన్ అక్తర్ ఫిబ్రవరి 19న ముంబైలోని ఖండాలాలోని సుకూన్ ఫామ్‌హౌస్‌లో తన ప్రియురాలు శిబానీ దండేకర్‌ను వివాహం చేసుకున్నారు.ఈ పెళ్లిలో ఇరువురి సన్నిహితులు, బంధువులు పాల్గొన్నారు.షిబానీ, ఫర్హాన్ అక్తర్ నాలుగు సంవత్సరాలుగా ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారు.ఫర్హాన్, షిబానీల పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

విక్రాంత్ మాస్సే

నటుడు విక్రాంత్ మాస్సే తన చిరకాల స్నేహితురాలు శీతల్ ఠాకూర్‌ని ఫిబ్రవరి 18న హిమాచల్ ప్రదేశ్‌లో పెళ్లి చేసుకున్నారు.2015 నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు.శీతల్, విక్రాంత్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వివాహం సందర్భంగా శీతల్ ఎరుపు రంగు దుస్తులను ధరించగా, విక్రాంత్ ఐవరీ షేర్వాణీని ధరించి కనిపించాడు.

సనా కపూర్

పంకజ్ కపూర్, సుప్రియా పాఠక్‌ల కుమార్తె సనా కపూర్, నటులు మనోజ్ పాహ్వా, సీమా పహ్వాల కుమారుడు మయాంక్ పహ్వాను మార్చి 2న వివాహం చేసుకున్నారు.షాహిద్ కపూర్ సోదరి వివాహం మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో వేడుకగా జరిగింది.దీనికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు.

అలియా భట్

బాలీవుడ్ ప్రముఖులు అలియా భట్, రణబీర్ కపూర్‌ల పెళ్లి కోసం అభిమానులు చాలా ఏళ్లుగా ఎదురుచూశారు.అలియా, రణబీర్ వివాహం ఏప్రిల్ 14 న వారి ఇంట్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది.ఈ సమయంలో అలియా భట్ చాలా అందంగా ముస్తాబయ్యింది.

ఆలియా పెళ్లి సందర్భంగా సబ్యసాచి చీర కట్టుకుంది.నవంబర్ నెలలో రణబీర్, అలియాలకు ఒక కుమార్తె జన్మించింది.ఆ చిన్నారికి వారు రాహా అని పేరు పెట్టారు.

నయనతార

Telugu Ali Fazal, Alia Bhatt, Bollywood, Karishma Tanna, Mouni Roy, Nayanthara,

నటి నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను 2022 జూన్ 9 న చెన్నైలో వివాహం చేసుకున్నారు.నయనతార పెళ్లికి షారుక్ ఖాన్ హాజరయ్యాడు.పెళ్లిలో నయనతార ఎరుపు రంగు చీర కట్టుకుంది.

విశేషమేమిటంటే పెళ్లియిన ఈ ఏడాదే నయనతార, విఘ్నేష్‌లు ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు.వారి పిల్లలు సరోగసీ ద్వారా జన్మించారు.

పాయల్ రోహత్గీ

Telugu Ali Fazal, Alia Bhatt, Bollywood, Karishma Tanna, Mouni Roy, Nayanthara,

నటి పాయల్ రోహత్గీ జూలైలో తన బాయ్‌ఫ్రెండ్ రెజ్లర్ సంగ్రామ్ సింగ్‌‌ను వివాహం చేసుకుంది.వీరిద్దరూ దాదాపు 12 ఏళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నారు.

రిచా చద్దా

Telugu Ali Fazal, Alia Bhatt, Bollywood, Karishma Tanna, Mouni Roy, Nayanthara,

బాలీవుడ్ నటీమణులు రిచా చద్దా, అలీ ఫజల్ ఈ ఏడాది అక్టోబర్‌లో వివాహం చేసుకున్నారు.ఇద్దరూ అబు జానీ, సందీప్ ఖోస్లా దుస్తులను ధరించారు.రిచా చద్దా, అలీ ఫజల్ వివాహానికి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు కూడా హాజరయ్యారు.వీరిద్దరి వివాహం 2021లో జరగాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది.

హన్సిక మోత్వాని

బాలీవుడ్ నుండి సౌత్ సినిమా వరకు తనదైన ముద్ర వేసుకున్న హన్సిక మోత్వాని, సోహైల్ కతురియాను 2022, డిసెంబరు 4 న జైపూర్‌లోని ఆరావళి కొండల మధ్య ఉన్న ముండోటా కోటలో రాజుల శైలిలో వివాహం చేసుకుంది.వేడకగా జరిగిన వీరి వివాహానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube