భారతీయ ఎన్నారైకి కళ్ళు చెదిరే లక్కీ డ్రా       2018-04-26   02:24:48  IST  Bhanu C

భారతీయ ఎన్నారై కి దుబాయి లో అదృష్టం కలిసొచ్చింది అలాంటిలాంటి అదృష్టం కాదు కళ్ళు చెదిరిపోయే లా భారీ లక్కు లక్కీ డ్రా రూపంలో పలకరించింది..రాత్రికి రాత్రే అతడిని కోటీశ్వరుడిగా చేసేసింది..అయితే ఇలాంటి లాటరీనే నెల రోజుల క్రితం కేరళాకి చెందిన భారతీయ ఎన్నారైకి కలిగింది..అయితే తాజాగా మరో భారతీయుడికి ఈ లక్కు వరించడం చర్చనీయాంశం అయ్యింది..వివరాలలోకి వెళ్తే..

దుబాయి లో భారీగా డబ్బు సంపాదించడానికి వెళ్ళిన ఎస్‌ఆర్. షేనే అనే వ్యక్తికి లాటరీ టిక్కట్లు కొనుగోలు చేసి తన అదృష్టాన్ని పరీక్షించు కుంటూ ఉంటాడు అయితే గత నాలుగేళ్ళుగా ఇదే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు అయితే తన ప్రయత్నం విఫలం కాలేదు సరికదా ఒక్క రాత్రిలో మిలినియర్ అయిపోయాడు ఏకంగా రూ.6.69 కోట్ల( 1మిలియన్ డాలర్లు) సంపన్నవంతుడిగా మారిపోయాడు…

యూఏఈలోని దుబాయ్ నగరంలో నివాసముంటున్న ఈ ఎస్‌ఆర్. షేనే డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలీనియర్‌‌ లక్కీ డ్రాలో విజేతగా నిలిచాడు..అయితే షేనే 269 సీరిస్‌లోని కొనుగోలు చేసిన 2916 నంబర్ ఈ లక్కీ డ్రాలో గెలుచుకుంది..ఈ సందర్భంలో దుబాయ్ డ్యూటీ ఫ్రీకి ధన్యవాదాలు తెలిపాడు ఇదిలాఉంటే అంటూ ఇప్పటి వరకూ దుబాయ్ ఈ లక్కీ డ్రాని గెలుపొందిన భారతీయుల లిస్టు 129 కి చేరింది అని ఆ సంస్థ తెలిపింది.