యూకే: ఇంట్లో తుపాకులు దాచిన భారత సంతతి యువకుడు.. ఏడేళ్ల జైలు శిక్ష

చట్టవిరుద్ధంగా ఇంట్లో తుపాకులను దాచినందుకు గాను 19 ఏళ్ల ఓ భారత సంతతి యువకుడికి యూకే కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.స్కాట్లాండ్ యార్డ్ నార్త్ వెస్ట్ కమాండ్ యూనిట్ అధికారులు నార్త్ లండన్‌లోని స్టాన్‌మోర్ ప్రాంతంలో చేసిన తనిఖీల్లో భాగంగా హృతిక్ సకారియా అనే భారతీయ యువకుడి ఇంట్లో తుపాకులు దొరికాయి.

 19 Years Old Indian-origin Man,  7-years In Jail, Hiding Guns,uk-TeluguStop.com

దీంతో అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హరో క్రౌన్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు.విచారణ సందర్భంగా హృతిక్ తన నేరాన్ని అంగీకరించడంతో అతనికి జడ్జీ ఏడేళ్ల జైలు శిక్ష విధించారు.

అలాగే షాట్‌గన్‌క సంబంధించిన కేసు విచారణ దర్యాప్తు దశలో ఉంది.

Telugu Indian Origin, Jail, Guns-

ముందస్తు తనిఖీలు సమాజాన్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడతాయని, ప్రాణాలను సైతం కాపాడతాయని మెట్ పోలీస్ డిటెక్టివ్ విభాగానికి చెందిన ఓ అధికారి అన్నారు.ఇలాంటి ప్రమాదకరమైన ఆయుధాలను ముందుగానే గుర్తించిన కారణంగా స్థానికులు ప్రశాంతంగా ఉంటారని ఆయన చెప్పారు.నేరాన్ని అంగీకరించినప్పటికీ హృతిక్ ఆయుధాలను ఎందుకు సేకరించాడో, ఎంతకాలం నుంచి వాటిని దాచాడో మాత్రం చెప్పలేదు.

గతేడాది ఆగస్టు 19 తెల్లవారుజామున నిందితుడిని యూకే ఫైర్‌ఆర్మ్స్‌ యాక్ట్ వారెంట్ కింద అతని ఇంట్లో తనిఖీలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు.ఈ సందర్భంగా ఇంటి అల్మారాలో లోడ్ చేసి వుంచిన రెండు గ్లోక్ హ్యాండ్ గన్, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

నేరం చేసిన వారు ఎక్కువ రోజులు తప్పించుకోలేరని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారికి హృతిక్ అరెస్ట్ ఓ హెచ్చరిక లాంటిదని అధికారులు అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube