భారత సంతతి బాలుడి కి అరుదైన గౌరవం     2018-07-16   14:03:09  IST  Sai Mallula

భారత సంతతికి చెందిన ఓ బాలుడికి అరుదైన గౌరవం దక్కింది..ఈశ్వర్ శర్మ అనే బాలుడికి నేషనల్ యోగా చాంపియన్ లో అత్యంత ప్రతిభ కనబరిచినందుకు గాను “బ్రిటిష్‌ ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌” గా గౌరవించి సత్కరించారు..జూన్ మాసంలో కెనడాలో జరిగిన వరల్డ్‌ స్టూడెంట్‌ గేమ్స్‌-2018లో బ్రిటన్ తరుపున ప్రాతినిధ్యం వహించిన ఈ భారత సంతతి బాలుడిని బంగారు పతకం కూడా వరించింది..

Indian Boy Eswar Got British Of The Year Award-

Indian Boy Eswar Got British Indian Of The Year Award

అయితే ఈ కారణంగా బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఆరో వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో ఈశ్వర్ కి ‘బ్రిటిష్‌ ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారంతో సత్కరించారు. ఈ అవార్డు ప్రధాన సంధర్భంలో ఈశ్వర్ మాట్లాడిన మాటలు ఎంతో మందిని ఆశ్చర్య పరిచాయి..ఈశ్వర్ ఏమన్నాడంటే… “ఏ విషయంలోనైనా నాకు నేను పోటీ అనుకుంటా. నాపై నాకు అపారమైన నమ్మకం ఉంది. కొన్ని కష్టతరమైన ఆసనాలను సవాల్‌గా తీసుకుని వేశా. యోగాలో నేనప్పటికీ నిత్య విద్యార్థినే. నాకు ఎన్నో విషయాలను నేర్పించిన నా ఉపాధ్యాయులకు ధన్యవాదాలు” అంటూ ఈశ్వర్‌ చెప్పుకొచ్చాడు.

ఈశ్వర్ తండ్రి ఉద్యోగ రీత్యా ఎప్పుడో బ్రిటన్ వచ్చి సెటిల్ అయ్యారు ఆయన పేరు విశ్వనాధ్ కర్ణాటక లోని మైసూర్ కి చెందిన ఆయన తన కొడుకుని యోగా లో అత్యంత ప్రతిభావంతుడిగా చేయాలని కలలు కనేవారట తన కుమారుడు తన కోరిక నేరవేర్చినందుకు ఆయన ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు..“ఈశ్వర్‌కు అవార్డు రావడం ఎంతో గర్వంగా ఉంది. అతను మెరుగైన ప్రదర్శన చేశాడు అంటూ సంతోషం వ్యక్తం చేశారు విశ్వనాధ్ .