భారత బయోటెక్ వ్యాక్సిన్ అద్భుతమన్న అమెరికా...డెల్టా పై సమర్దవంతంగా పని చేస్తోందంటూ కితాబు..!!!

భారత్ లో సెకండ్ వేవ్ ఏ స్థాయిలో విరుచుకుపడిందో, ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో అందరికి తెలిసిందే.ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ ను వృద్ది చేసిన హైదరాబాద్ లోని భారత బయోటెక్ సంస్థ తమ కొవాగ్జిన్ వ్యాక్సిన్ అత్యుత్తమమైన వ్యాక్సిన్ గా అభివర్ణించింది.

 Indian Biotech Vaccine Is Amazing America  The Book Seems To Be Working Effectiv-TeluguStop.com

నిపుణులు ఎంతో మంది కొవాగ్జిన్ పని తీరుపై ప్రసంసలు కూడా కురిపించారు.అయితే కొవాగ్జిన్ పై పలు పరిశోధనలు చేసిన అమెరికాకు చెందిన ఎన్ఐహెచ్ (అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ) హైదరాబాద్ కేంద్రంగా తయారయిన భారత బయోటెక్ వ్యాక్సిన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తోంది.

కొవాగ్జిన్ తీసుకున్న వారి సీరం పై విస్తృతమైన పరిశోధనలు చేసిన అమెరికా అందుకు సంభందించిన వివరాలను వెల్లడించింది.కరోనా లో ఇప్పటి వరకూ వచ్చిన వేరియన్స్ అన్నిటిపై సమర్ధవంతంగా పనిచేస్తోందని, ఆల్ఫా, డెల్టా వేరియంట్ లపై పనిచేయగల శక్తి సామర్ధ్యాలు ఇందులో ఉన్నాయని, డెల్టా వేరియన్ లను ఎదుర్కునే యాంటీ బాడీలను కొవాగ్జిన్ ఉత్పత్తి చేయడం ఎంతో ఆశ్చర్యం కలిగించిందని ఎన్ఐహెచ్ భారత బయోటెక్ కు కితాబు ఇచ్చింది.

Telugu Alpha, Booster Dose, Covagin Vaccine, Delta, Indian Biotech-Telugu NRI

అంతేకాదు శరీరంలో రోగ నిరోధక శక్తి ని పెంచగలిగే సామర్ధ్యం కొవాగ్జిన్ కు పుష్కలంగా ఉందని తెలిపింది.ఇప్పటి వరకూ ఈ వ్యాక్సిన్ పై రెండు సార్లు క్లినికల్ ట్రైల్స్ జరిగాయని, మూడో సారి జరిగే క్లినికల్ ట్రైల్స్ వివరాలు ఈ సంవత్సరం చివరిలో వెలువడుతాయని తెలిపింది.ప్రస్తుతం వచ్చిన రెండు ట్రైల్స్ ప్రకారం కొవాగ్జిన్ 80 శాతం సమర్దవంతంగా పనిచేస్తోందని ఎన్ఐహెచ్ తెలిపింది.ఇదిలాఉంటే కొవాగ్జిన్ బూస్టర్ డోస్ తీసుకోవడం ద్వారా కరోనా నుంచీ దీర్ఘకాలికమైన రక్షణ ఉంటుందని భారత బయోటెక్ సంస్థ డైరెక్టర్ ప్రకటించారు.

ఏది ఏమైనా భారత్ లో అది కూడా హైదరాబాద్ లో తయారయిన కొవాగ్జిన్ పై అమెరికా సైతం ప్రశంసలు కురిపించడం అందరూ గర్వించదగ్గ విషయమనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube