భారత బీచ్ లకు దక్కిన అరుదైన ఘనత!

ప్రపంచంలో బీచ్ లకు ఉన్న ప్రత్యేకత గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.టూరిస్టులు హాలిడే కోసం బీచ్ ఉన్న ప్రాంతాన్ని ఎక్కువగా ఎంచుకుంటారు.

 Blue Flag Certification Indian Beaches, Rushikonda Beach, Blue Flag Certificatio-TeluguStop.com

ప్రపంచంలో ఆస్ట్రేలియాలో ఎక్కువ బీచ్ లు ఉన్నాయి.అయితే అన్ని రంగాల్లో ర్యాంక్ లు ఉన్నట్లు బీచ్ లకు కూడా ర్యాంకింగ్ పద్ధతి ఉంది.

బెస్ట్ బీచ్ లకు బ్లూ ఫ్లాగ్ అనే బిరుదు ఇస్తారు.అయితే తాజాగా వెలువడిన ర్యాంకింగ్ లో భారతదేశంలో 8 బీచ్ లకు ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ గుర్తింపు లభించింది.

శివరాజ్ పూర్(గుజరాత్), ఘోగ్లా(డయ్యు), కాశరగోడ్, పడుబిద్రి(కర్ణాటక), కప్పడ్(కేరళ), రుషికొండ(వైజాగ్), గోల్డెన్(ఒడిశా), రాధనగర్(అండమాన్ ఆండ్ నికోబార్), డెన్మార్క్ లోని ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ ఇచ్చిందని,బ్లూ ఫ్లాగ్ గుర్తింపు లభించిన బీచ్ లను చూడడానికి ప్రపంచవ్యాప్త పర్యాటకలు ఇష్టపడుతారని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు.ఇక మన దేశంలోని 8 బీచ్ లకు ఇలాంటి ఘనత ఒకేసారి రావడం వల్ల రానున్న కాలంలో మన దేశ పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube