టెస్టు క్రికెట్లో సెంచరీ చేయడమే కష్టం.అలాంటిది డబుల్ సెంచరీ చేయడం పెద్ద విషయమే.
ఇందులో చాలామంది ఆటగాళ్లు డబుల్ సెంచరీ( Double Century ) ఒకటి, రెండు సార్లు కాకుండా మరిన్ని డబుల్ సెంచరీలు సాధించారు.టెస్టు క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లు ఎవరో చూద్దాం.
విరాట్ కోహ్లీ:

భారత తరఫున టెస్టు క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ( Virat Kohli ) అగ్రస్థానంలో ఉన్నాడు.కోహ్లీ ఇప్పటివరకు 7 సార్లు డబుల్ సెంచరీ సాధించాడు.టెస్టు క్రికెట్లో విరాట్ కోహ్లీ అత్యధిక స్కోరు 254 నాట్ అవుట్.ఇక పరుగుల విషయానికి వస్తే విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 110 టెస్ట్ మ్యాచ్లు ఆడి 8555 పరుగులు చేశాడు.ప్రస్తుతం భారత జట్టు సభ్యుడుగా కొనసాగుతూనే ఉన్నాడు.
వీరేంద్ర సెహ్వాగ్:

టెస్ట్ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్( Sehwag ) రెండవ స్థానంలో ఉన్నాడు.ఇతను ఇప్పటివరకు 6 సార్లు డబుల్ సెంచరీలు సాధించాడు.పరుగుల విషయానికి వస్తే వీరేంద్ర సెహ్వాగ్ 103 మ్యాచ్లు ఆడి 8503 పరుగులు చేశాడు.
టెస్టుల్లో సెహ్వాగ్ అత్యధిక స్కోరు 319.వీరేంద్ర సెహ్వాగ్ 2013లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్డ్ అయ్యాడు.
సచిన్ టెండుల్కర్:

టెస్ట్ క్రికెట్లో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన భారతీయ ఆటగాళ్ల జాబితాలో మూడవ స్థానంలో నిలిచాడు.సచిన్ టెండుల్కర్( Sachin Tendulkar ) కూడా టెస్ట్ క్రికెట్లో 6 సార్లు డబుల్ సెంచరీలు సాధించాడు.కాకపోతే సెహ్వాగ్ కంటే ఎక్కువ మ్యాచులు ఆడినందున మూడవ స్థానంలో నిలిచాడు.టెస్టులలో సచిన్ టెండూల్కర్ అత్యధిక స్కోరు 248 నాట్ అవుట్.సచిన్ టెండూల్కర్ 2013లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్డ్ అయ్యాడు.
రాహుల్ ద్రావిడ్:

ద్రావిడ్ టెస్ట్ క్రికెట్లో ఐదు డబుల్ సెంచరీలు సాధించి ఆ జాబితాలో 4వ స్థానంలో నిలిచాడు.ద్రావిడ్ అత్యధిక స్కోరు 270.2012 లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్డ్ అయ్యాడు.
సునీల్ గవాస్కర్:

గవాస్కర్ టెస్ట్ క్రికెట్లో నాలుగు డబుల్ సెంచరీలు సాధించి ఆ జాబితాలో ఐదవ స్థానంలో నిలిచాడు.ఇతను కేవలం 16 ఏళ్ల కెరీర్లో టెస్టులలో పదివేలకు పైగా పరుగులు సాధించాడు.ఇతని అత్యధిక స్కోర్ 236 నాట్ అవుట్.1987 లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్డ్ అయ్యాడు.