బూతు సినిమాలు మొబైల్‌ లో ఉండటంతో ఇండియన్‌ ను అరెస్ట్‌ చేసిన ఆస్ట్రేలియన్‌ పోలీసులు.. అసలు ఏమైందంటే

పలు ప్రపంచ దేశాలు పోర్న్‌ ను బ్యాన్‌ చేశాయి.బూతు సినిమాల వల్ల యువత చెడి పోతున్నారనే ఉద్దేశ్యంతో ఇండియాలో కూడా ఆ సినిమాలను బ్యాన్‌ చేసిన విషయం తెల్సిందే.

 Indian Arrested In Australian For Traveling With Illegal Videos-TeluguStop.com

అయితే ఇండియాలో బ్యాన్‌ ఉన్నా కూడా యదేచ్చగా ఆ సినిమాలు నడుస్తూనే ఉన్నాయి, సైట్స్‌ ఓపెన్‌ అవుతూనే ఉన్నాయి.ఆస్ట్రేలియాలో మాత్రం ఆ సినిమాలను బ్యాన్‌ చేశారు.

చిన్న పిల్లలతో ఉన్న ఆ సినిమాలను చూడటం, చిన్న పిల్లలతో చేసిన వీడియో మొబైల్‌ లో కలిగి ఉంటే కఠిన చర్యలు తప్పవు.తాజాగా ఒక ఇండియన్‌కు ఆస్ట్రేలియాలో ఆ పరిస్థితి ఎదురైంది.

ఇండియా నుండి ఆస్ట్రేలియా వెళ్తున్నాడు కనుక అక్కడ ఆ సినిమాలు బ్యాన్‌ ఉంటాయనే ముందు జాగ్రత్తతో ఆ యువకుడు తన ఫోన్‌ ను ఆ సినిమాలతో నింపేసుకున్నాడు.అక్కడికి వెళ్లిన తర్వాత ఇబ్బంది పడటం ఎందుకు అనుకుని అన్ని లగేజీలతో పాటు, వాటిని కూడా క్యారీ చేశాడు.అయితే పెర్త్‌ విమానాశ్రయంలో ఆ వీడియోలను అక్కడి అధికారులు చూసి అవాక్కయ్యారు.వందల కొద్ది ఉన్న వీడియోలను చూసి అతడిపై కేసు నమోదు చేశారు.ఆస్ట్రేలియాకు ఇలాంటి వీడియోలతో రావడంకు అక్కడి అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు.

ఆ సినిమాల విషయంలో ఆస్ట్రేలియాలో కఠినమైన చట్టాలు అమలు అవుతున్నాయి.ఒక వ్యక్తి ఫోన్‌లో వీడియో ఉందని, మరో వ్యక్తికి తెలిసి, ఆ సమాచారం పోలీసులకు ఇవ్వకుంటే ఇద్దరిపై కూడా కేసు నమోదు చేసేలా అక్కడ చట్టాలు ఉన్నాయి.పిల్లలను ఆ సినిమాలకు బానిస కాకుండా చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది.

ఇలాంటి చట్టాలు ఇండియాలో కూడా వస్తే బాగుండేది కదా, ఇండియాలో మరీ దారుణంగా 15 ఏళ్లకు అటు ఇటుగా ఉన్న పిల్లలే ఆ సినిమాలను తెగ చూస్తున్నట్లుగా ఒక సర్వేలో వెళ్లడయ్యింది.ప్రభుత్వానికి చిత్తసుద్ది లేకుంటే మరెన్ని దారుణాలు జరుగుతాయో.ఇండియాలో బ్యాన్‌ ఉన్నా కూడా ఆ వీడియోలను సదరు వ్యక్తి ఆస్ట్రేలియా వరకు తీసుకు వెళ్లాడంటే ఇండియాలో అధికారులు ఏ స్థాయిలో పని చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube