అమెరికాలో భారతీయ యువకుడి అరెస్ట్..ఎందుకంటే..   Indian Arrested For Robbery In America     2018-11-14   13:33:41  IST  Surya

అమెరికాలో ప్రీమాంట్ నగరానికి చెందిన వంశీధర్‌ రెడ్డి కోట్ల అనే యువకుడిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. వృద్దులని లక్ష్యంగా చేసుకుని అతడి అనేక నేరాలకి పాల్పడుతున్నాడని అనుమానించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.. మనీలాండరింగ్..ఫోర్జరీ..కుట్ర..దొంగతనం వంటి మోసాలకి అతడు పాల్పడుతున్నాడని ప్రాధమిక విచారణలో తెలినట్టుగా తెలిసిందని అంటున్నారు పోలీసులు.వివరాలలోకి వెళ్తే.

మోంటానా ప్రాంతానికి చెందిన ఓ వృద్దుడి ఫిర్యాదుతో ఆ భారతీయ వ్యక్తి మోసం బయటపడింది..పోలీసుల కథనం ప్రకారం.. ఒక వృద్దుడికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక వృద్ధుడికి ఫోన్‌ కాల్ వచ్చింది. సదరు వృద్దుడి మనుమడు పోలీసు కస్టడీలో ఉన్నాడని, బెయిల్‌ కోసం 20వేల డాలర్లను శాంతాక్లారాలోని ఒక చిరునామాకు చేర్చాలని ఆ ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి సూచించాడు. దీంతో ఆ వృద్ధుడికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందజేశాడు.

Indian Arrested For Robbery In America-Telugu NRI News Updates

దాంతో ఆ ప్రాంతం వద్ద పోలీసులు గస్తీ పెట్టడంతో అక్కడికి డబ్బు తీసుకోవడానికి వచ్చిన నిందితుడు అడ్డంగా దొరికిపోయాడు..అంతేకాదు అతడి నివాసంలో నుంచి 28,000 డాలర్ల నగదు కూడా స్వాధీనం చేసుకొన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడే ఓ ముఠాలో వంశీ కూడా ఒక సభ్యుడని పోలీసులు అనుమానిస్తున్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.