భారత్ సైనికులపై పాకిస్తాన్ ఆర్మీ హనీ ట్రాప్.. బయటపడ్డ నిజాలు  

ఇండియన్ ఆర్మీపై హనీ ట్రాప్ ని ప్రయోగిస్తున్న పాకిస్తాన్ ఐఎస్ఐ. .

Indian Army Warns Soldiers Of Honey Trap Bid By Instagram Profile \'oyesomya-indian Army Warns Soldiers,instagram Profile \\'oyesomya,pakistan Isi

పాకిస్తాన్ వక్ర బుద్ధి గురించి ప్రపంచానికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమ కుటిల బుద్ధితో ఇండియాలో మత కల్లోలాలు, మారణహోమాలు సృష్టించి, దేశాన్ని అస్తవ్యస్తం చేయడం అంటే వారికి చాలా సరదా. ఇదిలా ఉంటే గత ఐదేళ్ళుగా ఇండియాలో పాకిస్తాన్ ఆర్మీ టెర్రరిస్ట్ లని పంపించే ప్రయత్నం చేస్తూ ఉండగా దానిని సమర్దవంతంగా తిప్పికొడుతూ సరిహద్దు దాటి రాకుండా చేస్తున్నారు..

భారత్ సైనికులపై పాకిస్తాన్ ఆర్మీ హనీ ట్రాప్.. బయటపడ్డ నిజాలు-Indian Army Warns Soldiers Of Honey Trap Bid By Instagram Profile 'Oyesomya

కాశ్మీర్ బోర్డర్ లోనే టెర్రరిస్ట్ లని ఎరేస్తున్నారు. ఒక్కరికి కూడా దేశంలో ప్రవేశించే అవకాశం ఇవ్వడం లేదు. ఈ నేపధ్యంలో పాకిస్తాన్ మరో నీచమైన కుట్రకి తెరతీసింది.

జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాదుల ఆటకట్టిస్తున్న సైనికుల నుంచి రహస్యాలు, అలాగే స్థావరాలు గుట్టు లాగేందుకు హనీ ట్రాప్ కి సిద్ధమైంది. ఇండియన్ ఆర్మీకి అమ్మాయిలను ఎరగా వేస్తోంది. అమ్మాయిలని ఎరగా వేసి సైనికుల వీక్ నెస్ ని అవకాశంగా తీసుకొని హనీ ట్రాప్ కి పాల్పడుతుంది.

ఇలా అమ్మాయిల వలలో పడి కొందరు సైనికులు గతంలో అరెస్టయ్యారు. ఈ నేపధ్యంలో ఈ హనీ ట్రాప్ నుంచి జాగ్రత్తగా ఉండాలని సైనిక అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. తాజాగా కూడా సైన్యానికి ఓ హెచ్చరిక జారీ చేసారు.

పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్ఐ గూఢచారిగా పనిచేస్తున్న ఓ అమ్మాయి హనీ ట్రాప్‌ చేసేందుకు రంగంలోకి దిగిందని, సోషల్ మీడియా వేదికగా ఆమె టాలెంట్ చూపిస్తూ ఫేస్‌బుక్‌లో గుజ్జర్ సౌమ్య, ఇన్‌స్టాగ్రామ్‌లో ఓయ్‌సోమ్యా అని ఖాతాలు తెరిచి హనీ ట్రాప్ కి పాల్పడే ప్రయత్నం చేస్తుందని హెచ్చరించారు. వాటిపై అనుమానం రావడంతో మిలటరీ ఇంటెలిజన్స్ అధికారులు ఓ కన్నేశారు. ఆ రెండు అకౌంట్లు ఫేక్‌గా తేల్చారు.

మన జవాన్లకు వల వేసి విలువైన సమాచారం రాబట్టే కుట్రలో భాగమని అర్థమయింది. ఆమె ఓ మాజీ సైనికుడు సోదరిగా పరిచయం చేసుకొని హనీ ట్రాప్ కి పాల్పడే ప్రయత్నం చేసిందని, దీనిని గుర్తించడంతో ఎకౌంటు డిలేట్ చేసిందని తెలియజేసారు. ఇలాంటి వాటితో అప్రమత్తంగా ఉండాలని ఇంటలిజెన్స్ వారు హెచ్చరించారు.