భారత సైన్యం కీలక నిర్ణయం,ఆ 89 యాప్ లపై నిషేధం!

ఇటీవల భారత సైన్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో భారత సైన్యం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.జులై 15 లోపు సైనికులు,అధికారులు వెంటనే పేస్ బుక్,ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను తొలగించాలి అంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.

 Army Asks Soldiers, Officers To Delete Facebook And Instagram Accounts, Uninstal-TeluguStop.com

అంతేకాకుండా దాదాపు 89 యాప్ లను అందరూ తమ మొబైల్స్ నుంచి తొలగించాలి అంటూ స్పష్టం చేసింది.సమాచార భద్రతా ఉల్లంఘన,హానీ ట్రాపింగ్ నేపథ్యంలో భారత ఆర్మీ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

గతేడాది నవంబర్ లో కూడా అధికారిక సమాచారం కోసం వాట్సాప్ లను ఉపయోగించకూడదు అని సైన్యం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.

ఇప్పుడు తాజాగా మరో 89 యాప్ లపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవంటూ సైన్యం హెచ్చరించింది.టిక్ టాక్,హలో,షేర్ ఇట్ వంటి పలు యాప్ లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే పొరుగుదేశాలు అయినా చైనా,పాకిస్థాన్ వర్గాలు ఆన్ లైన్ లో భారత సైనికులను లక్ష్యంగా చేసుకొని హానీ ట్రాపింగ్, సమాచార భద్రతా ఉల్లంఘన ఘటనలు పెరుగుతున్న క్రమంలో ఈ మేరకు భారత ఆర్మీ నిర్ణయం తీసుకున్నట్లు ఒక అధికారి వెల్లడించారు.మహిళల పేర్ల తో కొంతమంది సైనికులను ట్రాప్ చేసి సమాచారాన్ని రాబడుతున్నారు అని అందుకే ఆ యాప్ లన్నిటిని తొలగించాలి అని ఆర్మీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

పాకిస్థాన్ ఏజెంట్లు భారత సైనికులను వలపు ఉచ్చులోకి లాగుతున్న ఘటనలు రెండు మూడేళ్ళుగా ఎక్కువ అవుతుండడం తో భారత ఆర్మీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది.ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే తప్పకుండా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడిస్తున్నారు.

ఇప్పటికే భారత ఆర్మీ ఫేస్ బుక్ లు వాడొద్దు అని,కార్యాలయాలలోకి,నావల్ డాక్ లోకి మొబైల్స్ కూడా తీసుకురావద్దు అంటూ గతంలోనే హెచ్చరించిన విషయం విదితమే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube