సైన్యంలోని కుక్క‌లు, గుర్రాలు రిటైర్ అయ్యాక వాటిని ఏం చేస్తారో తెలిస్తే షాక‌వుతారు!

భార‌త సైన్యంలో పదవీ విరమణ చేసిన‌ కుక్కలను, గుర్రాలను సైన్యం కాల్చివేస్తుందని అంటారు.దీనిలో నిజ‌మెంత అనేదానిపై అనేక సందేహాలున్నాయి.

 Indian Army Kills Loyal Dogs After Retirement Know Original Facts , Indian Army-TeluguStop.com

దీనిపై అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో కూడా ప్రచారం అవుతుంటాయి.ఇంటర్నెట్‌లో అనేక నివేదికలు క‌నిపిస్తుంటాయి.

రిటైర్మెంట్ తర్వాత కుక్కలను సైన్యం చంపేస్తుంద‌ని, సైన్యం ఇటువంటి చ‌ర్య‌లు చేస్తుందంటూ రకాల ఆరోపణలు కూడా వినిపిస్తుంటాయి.ఇది అమానవీయ చర్యగా పరిగణిస్తారు.

అయితే ఈ విష‌యంలో ఎంత వ‌ర‌కు నిజం ఉంద‌న్న‌దే ప్ర‌శ్న బ‌లంగా వినిపిస్తుంది.సైన్యం నిజంగా ఇలా చేస్తుందా అనే అనుమానాలు కూడా వినిపిస్తుంటాయి.

భారత సైన్యంలో సైనికుల మాదిరిగానే కుక్కలను కూడా నియమించి, వాటికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.శిక్షణలో వాటికి బాంబులు లేదా ఏదైనా పేలుడు పదార్థాలను బయటకు తీసేప‌నిలో సహాయం చేయడానికి సిద్ధం చేస్తారు.

సైన్యంలో లాబ్రడార్, జర్మన్ షెపర్డ్, బెల్జియన్ షెపర్డ్ జాతి కుక్కలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ కుక్కలకు వాటి ర్యాంక్, పేరు కూడా ఉంటుంది.

పదవీ విరమణ తర్వాత వాటికి సత్కారాలు కూడా చేస్తారు.ఇటీవల ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉత్తమంటా పని చేసింద‌ని కుక్కను కూడా సత్కరించారు.

సైన్యం నిజంగా కుక్కలను కాల్చివేస్తుందా అనే ప్రశ్న ఇంకా మ‌దిని తొలిచివేస్తుంటుంది.ది ప్రింట్‌లోని ఒక నివేదికలో, ఆర్మీ ప్రతినిధితో జ‌రిగిన సంభాషణలో ఈ ఆరోప‌ణ‌లు అవాస్త‌వ‌మ‌ని తెలిపారు.ఈ నివేదికలో ఆర్మీ ప్రతినిధి మాట్లాడుతూ .2015వ సంవత్సరంలో ప్రభుత్వ ఆమోదం తర్వాత సైన్యం జంతువుల అనాయాస మ‌ర‌ణాన్ని నిలిపివేసింద‌ని తెలిపారు.సైన్యంలో పదవీ విరమణ చేసిన తర్వాత కుక్కలను కాల్చరు.నయం చేయలేని వ్యాధులతో బాధపడుతున్న వాటికి మాత్రమే అనాయాస మరణాన్ని అందజేస్తామని ఆయన చెప్పారు.అయితే దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని భార‌త‌సైన్యం త‌మ విభాగంలోని కుక్కలను చంపుతుందని ప‌లువురు అంటుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube