నావికాదళంలో దేశ ద్రోహులు... పట్టుకున్న ఇంటలిజెన్స్

ఇండియన్ నేవీలో ఇంటిదొంగలు పడ్డారు.పాకిస్తాన్‌కు సమాచారం చేరవేస్తున్న ఏడుగురు నావికాదళ సిబ్బందిని ఇంటెలిజన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 Indian Andhra Pradesh Navy-TeluguStop.com

ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అదుపులోకి తీసుకున్నవారిని విజయవాడ కోర్టుకు తరలించారు.ఆ ఏడుగురి వివరాలను ఇంటెలిజెన్స్ అధికారులు భద్రతాకారణాల రీత్యా అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు.

అయితే పాకిస్థాన్ కి గూఢచార్యం చేస్తున్న ఆ నావీ అధికారులు ఎవరనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.వారిని పాకిస్థాన్ ఎలా లోబరుచుకుంది.

ఎలాంటి సమాచారం ఆ దేశానికి చేరవేశారు అనే విషయాలపై కూడా నిఘా అధికారులు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

భారత నావికాదళంలో దేశద్రోహులు ఉన్నారని కొన్నాళ్ల క్రితం అధికారులకు రహస్య సమాచారం అందింది.

అప్పటి నుంచి తూర్పు నావికాదళం మీద ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా ఉంచారు.వాళ్ల గుట్టు రట్టు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజన్స్ విభాగం స్పెషల్ ఆపరేషన్‌ మొదలెట్టింది.

ఇందుకు కేంద్ర నిఘా సంస్థల సహకారం తీసుకున్నారు.నావికాదళ నిఘా అధికారులు సైతం సహకరించారు.

ఈ నేపధ్యంలో పాకిస్తాన్‌కు కీలక సమాచారం చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఏడుగురు నేవీ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.వారితో పాటు.

ఓ హవాలా ఆపరేటర్‌ను కూడా అరెస్టు చేశారు.వీరి ఆపరేషన్ అంతా విశాఖ కేంద్రంగా నడుస్తుందని సమాచారం వినిపిస్తుంది.

మరి ఆ అధికారులు ఎవరు.దేశం గురించి ఎలాంటి సమాచారం చేరవేసారనే విషయాలు అధికారులు అఫీషియల్ గా చెప్పేంత వరకు వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube