అమెజాన్‌లో ‘‘లంచం’’ కేసు: తెలుగు ఎన్ఆర్ఐ సహా, ఆరుగురిపై నేరారోపణలు  

Indian among six indicted in $100,000 Amazon bribery case in US,US, Amazon bribery case , Indian,Amazon -

కార్పోరేట్ ప్రపంచంలో సంచలనం కలిగించిన అమెజాన్ ముడుపుల కేసులో తెలుగు ఎన్ఆర్ఐ సహా ఆరుగురిపై నేరారోపణ అభియోగాలు నమోదయ్యాయి.వీరిని యూఎస్ గ్రాండ్ జ్యూరీ విచారించనుంది.వీరంతా అమెజాన్ మార్కెట్ ప్లేస్‌లో అక్రమ మార్గం ద్వారా ప్రయోజనం పొందేందుకు సంస్థ ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు సుమారు లక్ష డాలర్లను ముడుపులుగా చెల్లించడంతో పాటు కుట్రకు పాల్పడ్డారని దర్యాప్తులో తేలింది.

TeluguStop.com - Indian Among Six Amazon Bribery Case Us

2017 నుంచి వీరు అక్రమంగా సంపాదిస్తున్నారు. థర్డ్ పార్టీ మర్చంట్స్, అనధికారిక కంప్యూటర్ వ్యవస్థ ద్వారా పోటీదారులకు, వినియోగదారులకు హాని కలిగే విధంగా తమ వస్తువులనే అమ్మడానికి ప్రయత్నించారని అమెరికా న్యాయశాఖ వెల్లడించింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో హైదరాబాద్‌కు చెందిన నిషాద్ కుంజు (31), కాలిఫోర్నియాకు చెందిన రోహిత్ కడిమిశెట్టి ( 27), న్యూయార్క్‌కు చెందిన ఎఫ్రాయిమ్ రోసెన్‌బర్గ్ (45), జోసెఫ్ నిల్సెన్ (31), క్రిస్టెన్ లెక్సీ (30) జార్జియాకు చెందిన హడిస్ నుహానోవివ్ (30) ఉన్నారు.

TeluguStop.com - అమెజాన్‌లో ‘‘లంచం’’ కేసు: తెలుగు ఎన్ఆర్ఐ సహా, ఆరుగురిపై నేరారోపణలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ ఆరుగురిని అక్టోబర్ 15న సీటెట్‌లోని కోర్టులో హాజరు పరచనున్నారు.ఈ కుట్రలో భాగంగా వీరు పదిమంది అమెజాన్ ఉద్యోగులకు, కాంట్రాక్టర్లకు ముడుపులు చెల్లించినట్లు అమెరికా అటార్నీ జనరల్ బ్రియాన్ మోరాన్ తెలిపారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian Among Six Amazon Bribery Case Us Related Telugu News,Photos/Pics,Images..