ఓసీఐ కార్డు రెన్యువల్ మరింత సులభతరం.. ఎన్ఆర్ఐల హర్షం

ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డుల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయాన్ని భారతీయ అమెరికన్లు స్వాగతించారు.దీని వల్ల వివిధ దేశాల్లో వున్న భారత సంతతి వ్యక్తులు ఈ విధమైన విధానాన్ని ఎంచుకుంటారని వారు అభిప్రాయపడ్డారు.

 Indian-americans Welcome New Rules On Overseas Citizens Of India Cards, Overseas-TeluguStop.com

ఓసీఐ కార్డుదారులు గతంలో మాదిరిగా పలుమార్లు కాకుండా .తమకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని 20 ఏళ్ల వయసులో ఒకసారి మాత్రమే ప్రభుత్వానికి సమర్పిస్తే చాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.ఈ నిర్ణయం వల్ల 20, 50 సంవత్సరాల వయసులో కార్డును పునరుద్ధరించే ప్రక్రియపై ఓసీఐ కార్డుదారుల్లో వున్న గందరగోళం తొలగిపోయింది.ఇది విదేశాల్లో వున్న భారతీయులను పెద్ద సంఖ్యలో ఓసీఐలుగా మారేందుకు ప్రోత్సహిస్తుందని ప్రవాసులు అంచనా వేస్తున్నారు.

దీని వల్ల భారతదేశానికి వెళ్లడానికి, పెట్టుబడులు పెట్టడానికి వీలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.విదేశాల్లో స్థిరపడిన భారతీయుల్లో మంచి గుర్తింపు వున్న ఓసీఐ కార్డు ద్వారా వారు జీవిత కాలం పాటు ఎలాంటి వీసా లేకుండా భారత్‌కు రావొచ్చు.

ఓసీఐ కార్డున్న వారు ఓటు హక్కు, ప్రభుత్వ సేవలు, వ్యవసాయ భూముల కొనుగోలు తప్ప మిగతా అన్ని హక్కులూ పొందేందుకు వెసులుబాటు వుంది.

ఓసీఐ కార్డు కలిగిన 20 ఏళ్ల లోపు వారు.50 సంవత్సరాలు పైబడిన వారు పాస్‌పోర్ట్ రెన్యువల్ చేయించుకున్న ప్రతీసారి కొత్తగా ఓసీఐ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వుండేది.ఇది విదేశాల్లోని భారత సంతతికి చెందిన ప్రజల్లో తీవ్ర గందరగోళానికి కారణమైంది.

ఓసీఐ కార్డుదారుల సమస్యల పరిష్కారంలో భాగంగా ఈ ఇబ్బందిని తొలగించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.దీనిలో భాగంగా 20 ఏళ్లలోపు ఓసీఐ కార్డుదారుడిగా రిజిస్ట్రేషన్ పొందిన వ్యక్తి మాత్రమే కొత్తగా ఓసీఐ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.

సాధారణంగా 20 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న తర్వాత కొత్త పాస్‌పోర్ట్‌ జారీ అవుతుంది.ఈ సమయంలో వ్యక్తి ముఖ కవళికల్లో మార్పులు చోటు చేసుకుంటాయి.అందువల్ల ఓసీఐ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది.ఇదే సమయంలో ఒక వ్యక్తి 20 సంవత్సరాలు నిండిన తర్వాత ఓసీఐ కార్డ్‌హోల్డర్‌గా రిజిస్ట్రేషన్ పొందినట్లయితే, అతను ఓసీఐ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకోనక్కర్లేదు.

Telugu America, Indians, Citizens India, Passport-Telugu NRI

ఓసీఐ కార్డ్‌దారుడు పొందిన కొత్త పాస్‌పోర్ట్‌లకు సంబంధించిన డేటాను అప్‌డేట్ చేసే ఉద్దేశ్యంతో ఫోటోను కలిగి వున్న కొత్త పాస్‌పోర్ట్ కాపీనీ ఓసీఐ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని కేంద్రం వెల్లడించింది.కొత్త పాస్‌పోర్ట్ 20 సంవత్సరాల వయస్సు వరకు, 50 సంవత్సరాల వయసు పూర్తయిన తర్వాత జారీ చేస్తారు.కొత్త పాస్‌పోర్ట్ అందిన 3 నెలల్లో ఈ పత్రాలను ఓసీఐ కార్డుదారుడు అప్‌లోడ్ చేయవచ్చని హోం శాఖ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube