#SupportVatsalyaGram: అనాథ శరణాలయానికి బాసట.. అట్లాంటాలో ఇండో అమెరికన్ల ఫండ్ రైజింగ్‌ ఈవెంట్

ఎక్కడ ఎలాంటి మంచి పని జరిగినా తమ వంతుగా చేయి అందించడం భారతీయుల రక్తంలోనే వుంది.అనాదిగా శాంతిని కోరుకునే దేశం మనది.

 Indian Americans Fund Raising Event To Support Orphanage Project Of Sadhvi Rita-TeluguStop.com

అందుకే ఇండియా అంటే అన్ని దేశాలు గౌరవిస్తాయి.ఇక.వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం వివిధ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు.అక్కడ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.

తాజాగా అమెరికాలోని అట్లాంటాలో స్థిరపడిన భారతీయ అమెరికన్ కమ్యూనిటీ ఓ మంచి పని కోసం నడుం బిగించింది.భారతీయ ఆధ్మాత్మికవేత్త సాధ్వి రితంభరచే నిర్వహించబడుతున్న ‘‘వాత్సల్య గ్రామ్’’ అనే అనాథ శరణాలయానికి మద్ధతుగా 50,000 అమెరికన్ డాలర్లను సేకరించేందుకు ప్రవాసులు ముందుకు వచ్చారు.

దీనిలో భాగంగా అట్లాంటాలోని గ్లోబల్ మాల్‌లో వున్న ఇంపాక్ట్ సెంటర్‌లో వందల మంది భారతీయ అమెరికన్లు గుమిగూడారు.

ఈ సందర్భంగా సాధ్వి రితంభర మాట్లాడుతూ… తన ప్రాజెక్ట్‌కు ప్రవాస సంఘాల నుంచి లభించిన మద్ధతుకు ధన్యవాదాలు తెలిపారు.

నిర్లక్ష్యానికి గురైన వేలాది మంది చిన్నారులను, మహిళలను సాధ్వి ఆదుకుంటున్నారని ఈవెంట్ నిర్వహకులు, గ్లోబల్ మాల్ యజమాని శివ్ అగర్వాల్ ప్రశంసించారు.ప్రాథమిక మానవ విలువలతో కూడిన ఒత్తిడి లేని జీవితాన్ని గడపటం గురించి సాధ్వి మాట్లాడారని ఆయన తెలిపారు.

Telugu American Hindus, Jain, Orphange, Asian Retail, Vatsalya Gram-Telugu NRI

అయితే మాల్ వెలుపల.భారతీయ అమెరికన్ ముస్లింలు సాధ్వి రితంభరకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనను నిర్వహించారు.ఈవెంట్‌ను రద్దు చేయాలని, భారత్‌లో మైనారిటీలకు వ్యతిరేకంగా గతంలో రితంభర చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలను ఖండించాలని ఆందోళనకారులు నిర్వాహకులను కోరారు.ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ అట్లాంటా చాప్టర్ అధ్యక్షుడు జమీర్ ఖాన్ మాట్లాడుతూ.

ద్వేషం, హింస వంటి భావజాలానికి సాధ్వి రితంభర ప్రాతినిథ్యం వహిస్తున్నారని వ్యాఖ్యానించారు.ఇది భారతదేశాన్ని చీల్చివేయడంతో పాటు ఇక్కడ వున్న మన కమ్యూనిటీలను కూడా బెదిరిస్తుందన్నారు.

ఈ క్రమంలో జార్జియాలో వున్న హిందూ, జైన్, సిక్కు, యెజిదీ, బౌద్ధమతాలకు చెందిన సాంస్కృతిక, న్యాయవాద సంస్థల ప్రతినిధులు సాధ్వికి అండగా నిలిచారు.ఆమెకు వ్యతిరేకంగా కొన్ని రాడికల్, తీవ్రవాద గ్రూపులు చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు.

ఆమెను దూషించడం, నిర్వాహకులు, మద్ధతుదారులపై దాడి చేయడం లక్ష్యంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని ప్రతినిధులు అన్నారు.ఈ ద్వేషపూరిత ప్రచారం ప్రధాన ఉద్దేశం.అమెరికాలో నాల్గవ అతిపెద్ద మైనారిటీలుగా వున్న అమెరికన్ హిందువులను భయపెడ్టడం కోసమేనని వారు ఆరోపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube