వాషింగ్టన్: ఇండో అమెరికన్ డిఫెన్స్ ఎక్స్‌పర్ట్‌ వివేక్ లాల్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం..!!

భారత సంతతికి చెందిన జనరల్ అటామిక్స్ సీఈవో వివేక్ లాల్‌ను ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది.‘‘విత్ గ్రేట్‌ఫుల్ రికగ్నేషన్’’ అనే కొటేషన్‌తో ఆయనను లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.

 Indian-american Vivek Lall Gets Life Time Achievement Award In Us,vivek Lall,wit-TeluguStop.com

ఇకపోతే.ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ వివేక్ లాల్‌కు ప్రతిష్టాత్మక ‘‘ఎంటర్‌ప్రెన్యూర్ లీడర్‌షిప్ అవార్డ్’’ అభించిన సంగతి తెలిసిందే.రక్షణ రంగంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఇండో అమెరిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ మేరకు ఆయనను ఎంపిక చేసింది.1968లో స్థాపించబడిన ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) అనేది భారత్- అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రోత్సహించే సంస్థ.

53 ఏళ్ల లాల్ ‘‘గ్లోబల్ లీడర్ ఇన్ డిఫెన్స్ అండ్ ఏవియేషన్ సెక్టార్’’ కేటగిరీ కింద అవార్డుకు ఎంపికయ్యారు.అలాగే బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్, జనరల్ అటామిక్స్‌లలో రక్షణ వాణిజ్యాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషించిన లాల్‌ను ఇటీవల కెంటుకీ గవర్నర్.

 Indian-American Vivek Lall Gets Life Time Achievement Award In US,Vivek Lall,Wit-TeluguStop.com

కెంటుకీ కల్నల్‌గా సత్కారించిన సంగతి తెలిసిందే.అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్ బుష్, జిమ్మీ కార్టర్, లిండెన్ జాన్సన్, రోనాల్డ్ రీగన్ వంటి మరికొందరు గతంలో ఈ గౌరవాన్ని అందుకున్నారు.

ఇకపోతే.ఇండోనేషియాలోని జకార్తాలో జన్మించిన డాక్టర్ వివేక్ లాల్. డ్రోన్లు, ఇతర రక్షణ పరికరాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే పేరెన్నిక కన్న జనరల్ అటామిక్స్‌కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు.

అమెరికన్ సెక్యూరిటీ అండ్ ఎయిరో‌స్పేస్‌ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్‌లో ఏరోనాటిక్స్ స్ట్రాటజీ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు.ఆ తర్వాత వివేక్ లాల్ 2020 ఏప్రిల్‌లో తన పదవికి రాజీనామా చేశారు.

కుటుంబంతో ఎక్కువసేపు గడపటానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు అప్పట్లో వివేక్ ప్రకటించారు.ఆ తర్వాత కొన్ని రోజులకే జనరల్ అటామిక్స్‌లో చేరుతున్నట్లు తెలిపి కార్పోరేట్ ప్రపంచంలో సంచలనం సృష్టించారు.

Video : Indian-American Vivek Lall Gets Life Time Achievement Award In US,Vivek Lall,With Grateful Recognition,General Atomics CEO,Lifetime Achievement Award,US President Joe Biden #TeluguStopVideo

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube