ఇండో అమెరికన్‌కు కీలక సభ్యత్వం: భారత్‌- అమెరికా - జపాన్‌ బంధానికి బలం  

ఇండో అమెరికన్ రక్షణ రంగ నిపుణుడు, అమెరికాలోని భారతీయ సమాజంలో ప్రముఖుడిగా వున్న డాక్టర్ వివేక్ లాల్‌కు రెండు ప్రఖ్యాత బిజినెస్ కౌన్సిళ్లలో సభ్యత్వం దక్కింది.యూఎస్- జపాన్ బిజినెస్ కౌన్సిల్ (యూఎస్‌జేబీసీ), యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్‌ఐబీసీ)‌ డైరెక్టర్ల బోర్డులో వివేక్ లాల్ చేరనున్నట్లు ఆ రెండు సంస్థలు ఇటీవల ప్రకటించాయి.

TeluguStop.com -  Indian American Vivek Lall Elected Board Member Of Top Us Business Councils

ఈ శతాబ్ధంలో భారత్- అమెరికా సంబంధాల రూపశిల్పిగా వివేక్ లాల్‌ను వాషింగ్టన్ డీసీలో పరిగణిస్తారు.యూఎస్‌జేబీసీ బోర్డులో డైరెక్టర్‌గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

21వ శతాబ్ధం ప్రారంభమైన నాటి నుంచి భారత్ – అమెరికా రక్షణ వాణిజ్యం 20 బిలియన్ డాలర్లను తాకింది.ఇటీవలి కాలంలో భారత్, అమెరికా, జపాన్‌లు స్వేచ్ఛా- వాణిజ్యం, సాంకేతికత, వ్యూహాత్మక భాగస్వామ్యం సహా పలు అంశాలపై కలిసి పనిచేయనున్నాయి.

TeluguStop.com - ఇండో అమెరికన్‌కు కీలక సభ్యత్వం: భారత్‌- అమెరికా – జపాన్‌ బంధానికి బలం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం జనరల్ అటామిక్ గ్లోబల్ కార్పోరేషన్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఆయన పనిచేస్తున్నారు.డాక్టర్ లాల్ యూఎస్‌జేబీసీలో చేరడం వల్ల యూఎస్- ఇండియా- జపాన్ వ్యాపార సంబంధాలను మరింత పటిష్టం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

యూఎస్ జపాన్ బిజినెస్ కౌన్సిల్ తన 57వ వార్షిక సమావేశాన్ని ఇటీవల నిర్వహించారు.కోవిడ్ 19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని వాణిజ్యం కోసం ఏమి చేయాలనే దానిపై రూట్ మ్యాప్‌ను రూపొందించింది.

ఇండోనేషియా రాజధాని జకార్తాలో జన్మించిన వివేక్ లాల్, ఒక దశాబ్ధం పాటు 18 బిలియన్ డాలర్ల విలువైన ఇండో-యూఎస్ రక్షణ ఒప్పందాలలో ఆయన కీలకపాత్ర పోషించారు.తాజాగా భారత నౌకాదళం కోసం లాక్‌హీడ్ మార్టిన్ నుంచి 24ఎంహెచ్-60ఆర్ మల్టీ రోల్ హెలికాఫ్టర్ల ఒప్పందం జరిగింది.2.6 బిలియన్ డాలర్ల ఈ డీల్‌కు సంబంధించి ఫిబ్రవరిలో ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఒప్పందం కుదిరింది.2017లో జనరల్ అటామిక్స్‌లో స్ట్రాటజిక్ డెవలప్‌మెంట్ విభాగానికి లాల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు.ఈ సమయంలో నాటోయేతర దేశమైన భారత్‌కు కేటగిరి-1 మానవరహిత వైమానిక వాహనాలను విడుదల చేసేందుకు గాను, వైట్ హౌస్ ఒప్పందం కుదుర్చుకోవడంలో ఆయన కీలకపాత్ర పోషించారు.

క్షిపణులను మోసుకెళ్లగల సామర్ధ్యం ఉన్న ఈ యూఏవీలు కేటగిరి-1 పరిధిలోకి వస్తాయి.

#Indo-US #USIndia #Technology #Vivek Lal

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Indian American Vivek Lall Elected Board Member Of Top Us Business Councils Related Telugu News,Photos/Pics,Images..