మిస్ ఇండియా యూఎస్ఏ 2022 విజేత ఆర్య వాల్వేకర్..!!!

భారతీయ అమెరికన్ టీనేజర్ ఆర్య వాల్వేకర్ (18) మిస్ ఇండియా యూఎస్ఏ 2022 కిరీటాన్ని గెలుచుకున్నారు.ఈమె స్వస్థలం వర్జీనియా రాష్ట్రం.

 Indian-american Teen Aarya Walvekar Crowned Miss India Usa 2022, Aarya Walvekar,miss India Usa 2022,virginia ,new Jersey,miss Talented Award,-TeluguStop.com

ఈ విజయం అనంతరం ఆర్య మాట్లాడుతూ… వెండితెరపై నన్ను నేను చూసుకోవాలని, సినిమాలు, టీవీల్లో పనిచేయాలనేది తన చిన్న నాటి కల అన్నారు.కొత్త ప్రదేశాలను అన్వేషించడం , వంట చేయడం, చర్చా కార్యక్రమాలలో పాల్గొనడం ఆర్యకు హాబీలు.

ఇక ఇదే పోటీలలో యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాలో రెండో సంవత్సరం ప్రీ మెడికల్ విద్యార్ధిని సౌమ్య శర్మ ఫస్ట్ రన్నరప్‌గా, న్యూజెర్సీకి చెందిన సంజన చేకూరి సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.

 Indian-American Teen Aarya Walvekar Crowned Miss India USA 2022, Aarya Walvekar,Miss India USA 2022,Virginia ,New Jersey,Miss Talented Award,-మిస్ ఇండియా యూఎస్ఏ 2022 విజేత ఆర్య వాల్వేకర్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సంవత్సరం పోటీలకు ప్రత్యేకత వుంది.

మిస్ ఇండియా యూఎస్ పోటీలు ప్రారంభించి 40 ఏళ్లు నిండాయి.ఇది భారత్‌కు వెలుపల ఎక్కువ కాలం నడుస్తోన్న , భారతీయులే నిర్వహిస్తున్న పోటీ.

దీనిని న్యూయార్క్‌కు చెందిన భారత సంతతికి చెందిన ధర్మాత్మ, నీలం శరణ్‌లు వరల్డ్ వైడ్ పేజెంట్స్ బ్యానర్‌పై ప్రారంభించారు.దీనిపై ధర్మాత్మ మాట్లాడుతూ.

సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా వున్న భారతీయ కమ్యూనిటీ మద్ధతుతోనే ఈ కార్యక్రమం విజయవంతంగా నడుస్తోందన్నారు.

Telugu Aarya Walvekar, India Usa, Award, Jersey, Virginia-Telugu NRI

ఇకపోతే.వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన అక్షి జైన్ మిసెస్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని, న్యూయార్క్‌కు చెందిన తన్వి గ్రోవర్ మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ కిరీటాన్ని అందుకున్నారు.అమెరికాలోని 30 రాష్ట్రాలకు చెందిన 74 మంది కంటెస్టెంట్లు మూడు వేర్వేరు పోటీల్లో (మిస్ ఇండియా యూఎస్ఏ, మిసెస్ ఇండియా యూఎస్ఏ, మిస్ టీన్ ఇండియా యూఎస్ఏ) పాల్గొన్నారు .మూడు కేటగిరీల విజేతలు అదే గ్రూప్ నిర్వహించే వరల్డ్ వైడ్ పేజెంట్స్‌లో పాల్గొనడానికి వచ్చే ఏడాది ప్రారంభంలో ముంబైకి కాంప్లిమెంటరీ టిక్కెట్‌లను అందుకున్నారు.

కాగా… గతేడాది మిచిగాన్‌కు చెందిన 25 ఏళ్ల వైదేహి డోంగ్రే మిస్ ఇండియా యూఎస్ఏ 2021 కిరీటాన్ని సొంతం చేసుకున్నారు.యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వైదేహీ డోంగ్రే.ప్రస్తుతం బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.భారతీయ శాస్త్రీయ నృత్యం కథక్‌లో అద్భుతమైన ప్రదర్శనకు గాను ఆమెకు ‘‘మిస్ టాలెంటెడ్’’ అవార్డు కూడా వరించింది.ఇదే పోటీలో రన్నరప్‌గా నిలిచిన 20 ఏళ్ల లలాని తన ప్రతిభ, ఆత్మవిశ్వాసంతో అందరినీ అబ్బురపరిచారు.

బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నప్పటికీ చివరి వరకు విజేతగా నిలిచేందుకు పోరాడారు.నార్త్ కరోలినాకు చెందిన మీరా కసరిని ఈ పోటీల్లో సెకండ్ రన్నరప్‌గా ప్రకటించారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube