అమెరికా: పద్మశ్రీ అవార్డ్ అందుకున్న టెక్ వ్యవస్థాపకుడు రోమేశ్ వాద్వాని.. !!!

2020వ సంవత్సరానికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసిన వారిలో ఇండో అమెరికన్ టెక్ వ్యవస్థాపకుడు డాక్టర్ రోమేశ్ వాద్వానీ ఒకరు.ఈ క్రమంలో బుధవారం శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సుల్ జనరల్ నుంచి రోమేశ్ … పద్మశ్రీ అవార్డును అందుకున్నట్లు ఆయన ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

 Indian American Tech Entrepreneur Romesh Wadhwani Receives His Padma Shri Award-TeluguStop.com

రోమేశ్ విజయవంతమైన వ్యవస్థాపకుడే కాకుండా , స్టార్టప్, గ్లోబల్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్, సామాజిక సేవా కార్యక్రమాలకు నేతృత్వం వహించారు.
గతేడాది కోవిడ్ 19 మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా ప్రయాణ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

దీంతో రాష్ట్రపతి భవన్‌లో జరిగే పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి రోమేశ్ హాజరుకాలేకపోయారు.దీంతో శాన్‌ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ జనరల్ ద్వారా తనకు అవార్డును అందజేయాలని రోమేశ్ వాద్వాని భారత ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా కాన్సుల్ జనరల్ టీవీ నాగేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.రోమేశ్ వాద్వానికి భారత ప్రభుత్వం తరపున పద్మశ్రీ అవార్డును అందజేయడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.

రోమేశ్ టీ వాద్వాని పాకిస్తాన్‌లోని కరాచీలో ఒక సింధీ కుటుంబంలో జన్మించారు.దేశ విభజనతో వీరి కుటుంబం భారత్‌కు వలస వచ్చింది.

రెండేళ్ల వయసులో రోమేశ్ పోలియో బారినపడటంతో ఆయనకు స్కూల్‌లో అడ్మిషన్ లభించలేదు.అయినప్పటికీ మొక్కవోనీ దీక్షతో ప్రయత్నించి చదువుకున్నారు.

అనంతరం ఐఐటీ బాంబే నుంచి బ్యాచిలర్ డిగ్రీ.అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు.

అమెరికన్ రోబోట్ కార్పోరేషన్, కంపూ గార్డ్ కార్పోరేషన్‌, సింఫనీ టెక్నాలజీ గ్రూప్‌కు ఫౌండర్, చైర్మన్, సీఈవోగా వ్యవహరించారు.కాథీ వాద్వానిని పెళ్లాడారు.

వీరికి ఒక కుమార్తె .పలు రంగాల్లో రోమేశ్ వాద్వాని చేసిన సేవలకు గాను 2018 ఆగస్టులో ఐఐటీ బాంబే నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది.

Indian American Tech Entrepreneur Romesh Wadhwani Receives His Padma Shri Award In San Francisco, Romesh Wadhwani, San Francisco,Padma Shri Award, Romesh Wadhwani Education, About Romesh Wadhwani - Telugu Romesh Wadhwani, San Francisco

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube