విషాదం : చికాగోలో భారత సంతతి విద్యార్ధినిపై అత్యాచారం, హత్య

అమెరికాలో భారత సంతతికి చెందిన 19 ఏళ్ల విద్యార్ధినిపై అత్యాచారం చేసి అనంతరం గొంతు నులిమి దారుణంగా హత్య చేశారు.ఈ ఘటన యూఎస్‌లోని భారతీయ సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది.ఈమె కుటుంబ స్వస్థలం హైదరాబాద్‌.30 సంవత్సరాల క్రితం అమెరికాలో స్థిరపడ్డారు.ప్రస్తుతం ఇల్లినాయిస్ యూనివర్సిటీలో గౌరవ విద్యార్ధిగా ఉన్న ఆమె శనివారం సాయంత్రం తన సొంత కారులో శవమై తేలింది.

 Indian American Student-TeluguStop.com

విద్యార్ధినిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని డోనాల్డ్ థుర్మాన్‌గా గుర్తించిన పోలీసులు… ఆదివారం చికాగో మెట్రో స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.నిందితుడికి వర్సిటీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.డిగ్రీ విద్యార్ధినిపై అత్యాచారం, హత్య ఆరోపణలు కింద కేసు నమోదు చేశారు.

గొంతు నులమడం వల్లే విద్యార్ధిని చనిపోయిందని మెడికల్ ఎగ్జామినర్ తేల్చింది.శుక్రవారం సాయంత్రం నుంచి పోలీసులకు తమ కుమార్తె కనిపించలేదని భాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు.

ఆమె ఫోన్ హాల్ స్టెడ్ స్ట్రీట్ పార్కింగ్ గ్యారేజ్ సమీపంలో పింగ్ చేయబటంతో పోలీసులు, కుటుంబసభ్యులు ఆ ప్రాంతానికి చేరుకుని గాలించారు.శనివారం సాయంత్రం బాధితురాలిని నిందితుడు అనుసరించినట్లు యూనివర్సిటీ సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు.

సదరు దృశ్యాల ప్రకారం ఆమె తెల్లవారుజామున 1.35 గంటలకు నడుచుకుంటూ గ్యారేజీలోకి ప్రవేశించింది.అనంతరం నిందితుడు అక్కడికి చేరుకున్నాడు.కొద్దిసేపటి తర్వాత 2.10 గంటలకు దుండగుడు హాల్‌స్టెడ్ వీధిలో నడుస్తూ కనిపించాడు.సీసీ కెమెరాల ఆధారముగా నిందుతుడిని మెట్ర స్టేషన్ లో అరెస్ట్ చేసినట్టు లోకల్ మీడియా ప్రచురించింది.

కాగా విద్యార్ధిని మరణానికి సంతాపంగా వర్సిటీ క్యాంపస్‌లో పసుపు రంగు రిబ్బన్లును వేలాడదీశారు.ఎందుకంటే అది బాధితురాలికి ఇష్టమైన రంగు అని తోటి విద్యార్ధి తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube